బాలానగర్ ఎస్సై తిరుపాజీ.
బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా పతంగి విక్రయదారుడు చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాలానగర్ ఎస్సై తిరుపాజీ శుక్రవారం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పతంగి ఎగరవేయడానికి ఉపయోగించే చైనా మాంజాల వల్ల మనుషులతో.. పాటు పక్షులకు ప్రమాదకరంగా మారాయన్నారు. నైలాన్, సింథటిక్ దారాలతో ప్రమాదం పొంచి ఉందని వ్యాపారులు ఈ దారాలను విక్రయించొద్దని తెలిపారు. చైనా మాంజాలు ఎవరైనా అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. పతంగిలు ఎగరవేసేటప్పుడు పిల్లలు పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలు ఉన్నచోట పతంగిలు ఎగరవేయకూడదన్నారు. విద్యుత్ స్తంభాలు లేని చోట.. విశాలమైన ప్రదేశంలో పిల్లలు పతంగిలను ఎగరవేయాలని సూచించారు. ఇంటి మేడపై పతంగిలు ఎగరవేసేటప్పుడు.. పిల్లలు పట్ల తల్లిదండ్రులు తగు శ్రద్ధ వహించాలన్నారు.