Activists Demand House Sites
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి
ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడు యాదండ్ల గట్టయ్య జిల్లా కార్యదర్శి పైడిపల్లి రమేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర సహాయ కార్యదర్శి మందాల రవీందర్ రెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు నిరాహార దీక్షలు ర్యాలీలు రైల్ రోకోలు వంటావార్పు కార్యక్రమాలు చేయడం జరిగింది అనేక కేసులతో జైలు పాలు అయి జైలు జీవితం గడిపినాము కావున ప్రభుత్వం మాకు 250 గజాల ఇంటి స్థలం ఉద్యమకారులకు 25000 పింఛన్ నెలకు ఇవ్వాలి ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అని వారు అన్నారు అలాగే తెలంగాణ ప్రభుత్వం మమ్ములను గుర్తించి మాకు ఒక జీవో నెంబర్ రిలీజ్ చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 679 ను జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ఈ జీవోను విడుదల చేసింది.ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన, శారీరక వైకల్యం పొందిన లేదా జైలు జీవితం గడిపిన ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గుర్తింపు, సౌకర్యాలు కల్పించడం కమిటీ ఉద్దేశం కమిటీ చైర్మన్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే. కేశవరావు ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.సభ్యులు మంత్రులు, ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖులతో ఈ కమిటీ ఏర్పాటయింది. జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల
జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపరాజు సాంబ లక్ష్మి.
బొమ్మేర రాజేశ్వరి మేకల సంపత్, క్యాతరాజు సాంబమూర్తి,బండారి రవి, బట్టు రవి, గీస సంపత్,గాదం జయ, ఎద్దు పుష్ప, వాసాల స్వప్న,మహమ్మద్ అన్వేర్, యాళ్ల సురేందర్, సుర రాజేష్,పుట్టపాక పుష్ప తదితరులు. పాల్గొన్నారు
