మహిళా సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
జైపూర్,నేటి ధాత్రి:
మహిళా సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూరు నియోజకవర్గంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీలో ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ కామేర మనోహర్,ఉప సర్పంచ్ కుమ్మరి రాజశేఖర్,వార్డు సభ్యులు,మహిళా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కామేర మనోహర్ మాట్లాడుతూ రైతులందరూ తమ పంటను ఐకెపి కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు.దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని,ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని తెలిపారు.ఉప సర్పంచ్ కుమ్మరి రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు తమ పంటను వడ్ల కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందు తాలు,తేమ శాతం లేకుండా శుభ్రంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు.
అలాగే మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలు,ఇతర సంక్షేమ కార్యక్రమాలలో పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.మహిళా సంఘాల సీసీ రాజన్న మాట్లాడుతూ ఐకెపి కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి,కేటాయించిన రైస్ మిల్లర్లకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సీసీ రాజన్న,అశ్విని వివో సభ్యురాలు స్వరూప,సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
