Improve Public Healthcare
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ సైదులు
డిప్యూటీ డి ఎం హెచ్ వో
డాక్టర్ శ్రీధర్
నేటిదాత్రి చర్ల
చర్ల మండలంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కొయ్యురులో గురువారం జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ సైదులు మరియు డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా సందర్శించారు
ఆసుపత్రిలోని అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు రోగుల రిజిస్టర్లు ఔషధాల నిల్వలు సిబ్బంది హాజరు పట్టికలను వెరిఫికేషన్ చేశారు
ఎండాకాలం దృష్ట్యా వడదెబ్బ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు ఫీల్డ్ స్టాఫ్ హెల్త్ స్టాఫ్ మరియు ఆశా కార్యకర్తల వద్ద సరిపడా ఓర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు ముఖ్యంగా కరువు పనులు సిమెంట్ పనులు ఇటుకల బట్టీల వద్ద పనిచేసే కూలీలకు ఓఓర్ఎస్ సులభంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్ సైదులు తెలిపారు వడదెబ్బ లక్షణాలు ప్రథమ చికిత్సపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు
ఈ కార్యక్రమంలో చర్ల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హారిక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కే రామలక్ష్మి హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు
