Farmers Demand Immediate Compensation for Crop Loss in Telangana Farmers Demand Immediate Compensation for Crop Loss in Telangana
రైతులు పండించిన పంట నేలపాలేనా ?
– తక్షణమే రైతులను ఆదుకోవాలి
– తెలంగాణ రక్షణ సేన గుంటుక సంపత్ డిమాండ్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
అకాల వర్షం ఈదురు గాలుల వల్ల తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ రైతులకు తీవ్రంగా నష్టం జరిగింది అని తెలంగాణ రక్షణ సేన(టి.ఆర్.ఎస్) పార్టీ రాజన్న సిరిసిల్ల నాయకులు గుంటుక సంపత్ అన్నారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం త్వరతగతిన కొనుగోలు చేసి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు. ఇవ్వకపోతే తెలంగాణ రక్షణ సేన (టి.ఆర్. ఎస్)పార్టీ తరపున పెద్ద ఎత్తున రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని తెలంగాణ రక్షణ సేన పార్టీ రాజన్న సిరిసిల్ల నాయకులు గుంటుక సంపత్ డిమాండ్ చేసారు.
