Free Medical Camps at Sircilla Day Care Center
సిరిసిల్ల డే కేర్ సెంటర్లో ప్రతి గురువారం ఉచిత వైద్య పరీక్షలు – మందుల పంపిణీ
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
https://www.youtube.com/live/I8TAiTEzfEk?si=9ETzhzTfT3omt0my
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డే కేర్ సెంటర్లో ప్రతి గురువారం వయోవృద్ధుల కోసం ఉచిత వైద్య పరీక్షలు మరియు మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వృద్ధులకు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు.
వయోవృద్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి గురువారం డే కేర్ సెంటర్కు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని తగిన మందులు పొందాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జనాపాల శంకరయ్య, ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, కోశాధికారి దొంత దేవదాసు, కార్యదర్శి, ఈసీ మెంబర్ జ్ఞానోభ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వయోవృద్ధులకు అవసరమైన వసతులు కల్పిస్తూ సహకరించారు.
