Man Killed in Lorry Accident
లారీ ఢీకొని వ్యక్తి మృతి
నేటిధాత్రి, చేవెళ్ల :
అతివేగంతో అదుపుతప్పి లారీ ఢీకొని ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం ఉదయం చేవెళ్ల మండలం పామేనా గేటు వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన మల్కమోళ్ల నర్సిములు (40) పోతుగల్ గ్రామం నుండి పనుల నిమిత్తం నగరానికి వెళ్తున్న నర్సిములు ద్విచక్ర వాహనాన్ని పామేనా గేటు సమీంలో చేవెళ్ల నుండి షాద్నగర్ వైపు ఎదురుగా వస్తున్న లారీ (MH04 HY8312 ) అదుపు తప్పి డికొనగా నర్సిములు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సంతోష్ రెడ్డి తెలిపారు.
