Mudhiraj Reservation Demand Raises Questions
ముదిరాజ్ ల వాటా ఎటు పోతుంది…?
బీసీ డి నుండి బీసీ ఏ మార్చే అంశం పత్రాలకే పరిమితమా…?
మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్
కేసముద్రం/ నేటి ధాత్రి
శనివారం కేసముద్రం మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో మెపా ( ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) కేసముద్రం మండల ప్రధాన కార్యదర్శి కుండ సురేష్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…రాష్ట్ర జనాభాలో ముదిరాజ్ లే అధికంగా ఉన్నారనీ, జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముదిరాజ్ లకు రావాల్సిన వాటా ఎటుపోతుందో? ముదిరాజ్ లను బీసీ డి నుండి బీసీ ఏ కు మారుస్తామని ఇచ్చిన హామినీ ఎటు పోయిందో కూడా ప్రభుత్వం చెప్పాలని అన్నారు. రానున్న కాలంలో పార్టీలకు అతీతంగా ముదిరాజ్ రిజర్వేషన్ కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల ప్రధాన కార్యదర్శి కొండ సురేష్ ముదిరాజ్ ,శాగంటి శ్రీనివాస్,సిరికొండ శ్రీకాంత్,కొండ పాపారావు
సిరికొండ అనిల్ ముదిరాజ్ లు పాల్గొన్నారు. అలాగే త్వరలో
మెపా జిల్లాలో అన్ని మండల కమిటీలు వేయనున్నామని ,ఆ కమిటీలో ముదిరాజ్ యువతకు పెద్దపీట వేస్తామని పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.
