50. తునికాకు ల కట్టకు 5.రూపాయల గిట్టుబాటు ధర చెల్లించాలి

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

చర్ల మండలం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి నూప.పోతయ్య అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవిలో మూడవ పంట అయిన తునికాకు పంట వేసవి వచ్చిందంటే మే నెల మొదటి వారంలో ఆదివాసి ఆదివాసి యేతర గ్రామీణ పేదలు అడవి బిడ్డలు తునికి.ఆకు సేకరించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరుగుతుందని ఎండని సైతం లెక్కచేయకుండా చెట్లు, పుట్టలు,గుట్టలు ఎక్కి అడవి జంతువుల భారి నుంచి తప్పించుకొని తునిగాకు సేకరించడం అంటే ప్రాణాలతో చెలగాటమే అన్నారు అయినా ఆదివాసులు ఇతర పేదలు బ్రతుకు దేరువు కోసం తునికి ఆకు సేకరించాల్సి వస్తుందని ఇంత కష్టపడి తునికి ఆకు సేకరిస్తే సరైన గిట్టుబాటు ధర లేక ఆదివాసులు నష్టపోతున్నారన్నారు. కానీ తునికాకు కొనుగోలు చేసే గుత్తేదారులు ,(కాంట్రాక్టర్లు) మాత్రం కోట్లకు పడగలేత్తుతున్నారని తునికి ఆకు సేకరణలో ఆదివాసులు క్రూర మృగాల దాడిలో గాయపడి మరణిస్తున్న వారికి మాత్రం ప్రభుత్వం గానీ గుత్తేదారులు గాని సరైన నష్టపరిహారం చెల్లించడం లేదని హెచ్చరించారు 50. ఆకుల తునికి ఆకు కట్టకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆదివాసులను నిలువునా మోసం చేస్తూ ఉన్నారని తునికి ఆకు ఆదివాసులు కోయకపోతే బీడీ పరిశ్రమలు మూతపడతాయని దీని దృష్టిలో పెట్టుకొని 50 ఆకుల తునికి ఆకు కట్టకు కనీసం 5. రూపాయల కిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు తునికాకు సేకరణలో అడవి జంతువుల బారినపడి గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు మరణించిన వారికి 5.లక్షల రూపాయలు చెల్లించాలని అన్నారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు ఇవ్వని తునికాకు బోనస్ ని వెంటనే చెల్లించాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు అడ్డగర్ల.తాతాజీ. తిరుపతిరావు .రామారావు. నాగేశ్వరావు ముత్తయ్య. మంగమ్మ. అనసూర్య.వెంకటనరసమ్మ.భద్రమ్మ.లక్ష్మి.పద్మ.రామయ్య.శ్రీను. సత్యనారాయణ .వెంకట్ రెడ్డి. లక్ష్మయ్య. సావిత్రి. ముత్తమ్మ. రమేష్ కన్నయ్య .గంగయ్య. చిన్న. సింగయ్య. రాంబాబు. సుబ్బయ్య. రాజారావు. నాగరాజు. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *