నవతరం రాజకీయ యుగం…ఇది కేసిఆర్‌ శకం…

కొత్త జాతీయ పార్టీ కేసిఆర్‌తోనే సాధ్యం…

ఏ పార్టీ వేలు పట్టకొని ఎదగలేదు….

ఎవరి కోసమో రాజకీయం చేయలేదు…

జనం కోసం రాజకీయం చేసిన నాయకుడు కేసిఆర్‌….

తెలంగాణ ఎజెండా రాజకీయ దిశ మార్చుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌…

జనం ఆకాంక్ష కోసమే రాజకీయమైన ఉద్యమ కారుడు….

తెలంగాణ సాధనలో త్యాగధనుడు….

అరవై ఏళ్ల తెలంగాణ కార్యసాధకుడు…

తెలంగాణ విముక్తి ప్రధాతయ్యాడు….

ఇప్పుడు దేశానికి అవసరమౌతున్నాడు…

దేశ ప్రగతి కోసం ముందుకు సాగుతున్నాడు…

జాతీయ పార్టీ ఏర్పాటు వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు….

దేశం మీసం మెలేసే నాయకుడుగా కదులుతున్నాడు…

పరుగెత్తే కాలాన్ని పట్టుకొనే నాయకుడు ఇప్పుడు దేశానికి కావాలి. దేశ ప్రగతిని పరుగెత్తించగలిగే నాయకుడై వుండాలి. అది కేసిఆర్‌ లా వుండాలి. అందుకే కేసిఆర్‌ రావాలి. ప్రగతి దారిలో గతి తప్పిన దేశం సిరుల బాట పట్టేందుకు, సంక్షేమం చిగురించేందుకు కేసిఆర్‌ కావాలి. తెలంగాణ గతిని మార్చి, ప్రగతిని ఆవిష్కరించిన నేత కేసిఆర్‌ సేవలు ఇకపై దేశానికి కావాలి. దేశమంతా తెలంగాణ మోడల్‌గా అభివృద్ధి జరగాలి. తెలంగాణలో ఆరేళ్ల కాలంలో వెల్లివిరిసిన పచ్చదనం, ప్రగతి పథం దేశమంతా కనిపించాలి. ప్రపంచమంతా వినిపించాలి. అందుకు కేసిఆర్‌ దేశానికి దిశా నిర్ధేశం చేసేందుకు కదలాలి. దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌ అని గురజాడ చెప్పినట్లు, మనిషిని మనిషిగా మళ్లీ గౌరవించుకునే రోజులు రావాలి. మతాల మధ్య విషాలు లేని సమయం రావాలి. అందుకు కేసిఆర్‌ నాయకత్వం కావాలి. పార్టీ కావాలి. రాజ్యాంగరిత్యా మత ప్రయేయం లేని రాజ్యం మళ్లీ చిరుగు తొడగాలి. ఎన్నికల కోసం, సీట్ల కోసం, అధికారం కోసం, పదవుల కోసం మాత్రమే రాజకీయం చేస్తున్న పార్టీలకు చరమగీతం పడాలంటే కేసిఆర్‌ రావాలి. అభివృద్ధి అన్ని వర్గాలకు సమానమైన హక్కుగా అందాలి. అందరూ సుఖ సంతోషంగా వుండాలి. నాయకులకు, రాజకీయ పార్టీలకు ప్రజలు, వారి జీవితాలు, సంక్షేమాలు, వారి బాగోగులు ఎజెండా కావాలి. మతాలు, కుత్సితాలు, కులాలు, కల్పనలకు దూరంగా వుండాలి…అందరూ ఒక్కటే…మనమంతా సమానమే…మన దేశ ప్రగతే మన ఆశయం కావాలి. మన దేశంలో ప్రజలంతా ఎలాంటి తారతమ్యాలు తేకుండా ఒత్తిళ్లు లేకుండా జీవించగలగాలి. ఓట్లకోసం సమాజాన్ని చీల్చొదు. అని బలంగా నమ్మే నాయకుడు కేసిఆర్‌….జనం బాగోగులు మాత్రమే తెలిసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌….

యుగానొక్కడు పుడతాడు. శకాన్ని నిర్మిస్తాడు. తరానికొకడు ఉద్భవిస్తాడు. చరిత్రకు జీవం పోస్తాడు. తనే చరిత్రౌతాడు. ఒకతరానికి దిక్సూచీగా నిలుస్తాడు. ప్రతి అడుగులో అతనే కనిపిస్తాడు. ప్రతి కాలంలోనూ అతనే వినిపిస్తాడు. ప్రతి వ్యక్తి ఆశయంలో అతన్నే చూసుకుంటారు. ఇలా చరిత్రలో పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు అనేక మంది వున్నారు. వారిని కాలం మర్చిపోదు. చరిత్ర విస్మరించదు. ప్రపంచ గమనంలో వారు లేకుండా ఏ ఒక్క అడుగూ పడదు. అలాంటి వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని అంటే అతిశయోక్తికాదు. ఎందుకంటే ఒక వ్యవస్ధ ఆశయాన్ని తన లక్ష్యంగా చేసుకొని సాగిన, నవతరం నాయకుల్లో అతి కొది మంది మాత్రమే కనిపిస్తారు. జనం ఆకాంక్షల కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎంత దూరమైన వెళ్తారు. ఎంతటి ఉపద్రవాన్నైనా ఎదుర్కొంటారు. అందరిలో కలిసి బతుకుతారు. అందరికోసమే బతుకుతారు. అలాంటివారిలో మన దేశంలో దేశ స్వాతంత్య్రోమ కాలంలో మహాత్మాగాందీ, తెలంగాణ సాధకుడు కేసిఆర్‌లను మాత్రమే గుర్తిస్తారు. అందుకు అనేక రూపాలు, స్వరూపాలు కనిపిస్తాయి. ఎక్కడో దక్షిణాఫ్రికాలో వున్న మహాత్మాగాంధీ మన దేశానికి వచ్చి, అప్పటికే సాగుతున్న స్వాతంత్రోద్యమానికి దిక్సూచీ అయ్యారు. ప్రతి అడుగుకు దిశానిర్థేశం చేశారు. ఉద్యమ కారులందరినీ తనదారిలోకి తెచ్చుకున్నారు. అంతిమంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు. వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు పాలకులుగా మారినా, ఐక్యతలేని ఆనాటి భారతీయ సమాజాన్ని విభజించి పాలించారు. వంద సంవత్సరాల పాటు సాగిన సుధీర్ఘ పోరాటంలో ఆటుపోట్లు తప్ప విజయాలు చూడలేదు. కాని మహాత్మాగాంధీ రాకతో ఉద్యమానికి విజయాలు అండడం మొదలుపెట్టాయి. పోరాటాలు విజయాలు సాగిస్తూ వచ్చాయి. సరిగ్గా తెలంగాణ ఉద్యమం మొత్తం పరిశీలిస్తే అదే కనిపిస్తుంది. అసలు ఉమ్మడి రాష్ట్రం పురుడు పోసుకోకముందే ముల్కీ నినాదం మొదలైంది. అయినా రెండు తెలుగు ప్రాంతాలు ఏకం కావడంతో తెలంగాణ మరింత దోపిడికీ గురైంది. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు నుంచే మొదలైన వ్యతిరేకతను ఎంత మంది వ్యక్తపర్చినా, కేసిఆర్‌ లా గర్జించిన వారు లేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టిన వారు లేదు. తన రాజకీయ జీవితం ఒక వైపు, తెలంగాణ ఆకాంక్ష ఒక వైపు అన్నది తేల్చుకోవాల్సిన సమయంలో తెలంగాణ సాధన వైపు నిలిచిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌ తీసుకున్న ఆ నిర్ణయంతోనే తెలంగాణ సరికొత్త చరిత్రకు శ్రీకారం జరిగింది. అవరోధాలను అధిగమిస్తూ, నిందలు భరిస్తూ, ఒత్తిని త్వజిస్తూ, నిరంతర, నిర్విరామ పోరాటం చేశాడు. పాలకుల శ్వాసకు అడ్డం పడ్డాడు. తెలంగాణ ఇస్తేగాని ఊపిరి తీసుకోలేని పరిస్ధితి కాంగ్రెస్‌కు తెచ్చాడు. తెలంగాణ సాధించాడు. 

                        ఒక తరానికి, మరొక తరానికి మధ్య ఏర్పడే సామాజిక, ఆర్ధిక, ప్రగతి అగాధాలను పూడ్చడం కోసం ఎవరో ఒకరు రావాలి. ప్రస్తుత తరుణానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ కావాలి. ప్రపంచంలో ఎక్కడో పుట్టే, నదులు కూడా కాలగతిలో దిశను మార్చుకుంటాయి. మరో ప్రాంత సస్యశ్యామలం కోసం పరుగులు పెడుతుంటాయి. అలాగే తెలంగాణ ఆకాంక్ష కోసం, అభివృద్ధి కోసం కేసిఆర్‌ చేసిన యజ్ఞం పూర్తయింది. చేసిన యాగం ఫలితమిచ్చింది. తెలంగాణ ఏర్పడిరది. తెలంగాణ సాధించి, చేయాల్సిన అభివృద్ది పూర్తయ్యింది. తెలంగాణ సస్యశ్యామలమైంది. తెలంగాణలో కరంటు వెలుగులతో నిండిరది. సంక్షేమం, ప్రగతి రెండు కళ్లుగా సర్వతోముఖాభివృద్ది సాధించింది. తెలంగాణ ఉద్యమాల అడ్డ . పోరాటాల గడ్డ. . తొలి తరం తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం జరిగింది సిద్ధిపేట గడ్డ సాక్షిగానే…మలి తరం ఉద్యమానికి ఊపిరి పోసింది సిద్దిపేట అడ్డలోనే….దేశ భవిష్యత్తు కొత్త తరం రాజకీయాలు పురుడుపోసుకునేది కూడా సిద్ధిపేట నుంచే…అది కేసిఆర్‌ బలమైన పట్టుదలనుంచే…

ఉద్యమాల గడ్డ తెలంగాణ నుంచే దేశ దిశ`దశను మార్చే నూతన ఆవిష్కరణకు శ్రీకారం జరగనుంది. కొత్త జాతీయ రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. కాలానికి అనుగుణమైన ప్రేరణ జరగాల్సిన అవసరం వుంది. దేశమంతా వికాసం వెల్లివిరియాల్సిన తరుణం ఆసన్నమైంది. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఏక రీతి పాలనతోపాటు, ఏక రీతి ప్రగతి చోటు చేసుకోవాలి. ఇప్పుడు దేశంలో వున్న నాయకులంతరూ ఒక వైపు, కేసిఆర్‌ మాత్రమే ఒక వైపు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. దేశంలో బిజేపినుంచి మొదలు, కాంగ్రెస్‌తోపాటు, అన్ని ప్రాంతీయ పార్టీలో పార్టీలలో పార్టీ పేరు చెప్పుకొని ఎదిగిన నేతలే అందరూ. కాని పార్టీ అంటే కేసిఆర్‌…కేసిఆర్‌ అంటేనే టిఆర్‌ఎస్‌ అనే సార్ధకత వున్నది ఒక్క కేసిఆర్‌కే. అంతే కాదు కేసిఆర్‌కు ఏనాడు సొంత ఎజెండా లేదు. తన రాజకీయ జీవితం కోసం ఎవరి జెండా మోయలేదు. జనం కోసం జెండా ఎత్తాడు…జనమే ఆకాంక్షనే ఎజెండా చేసుకున్నాడు. జన నాయకుడయ్యాడు. జనం కోసం రాజకీయం చేసిన ఈ తరం ఏకైక నాయకుడుగా కేసిఆర్‌ చరిత్రలో నిలిచారు. జనం ఆకాంక్ష కోసం తన రాజకీయ జీవితాన్ని మార్చుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. జనం నుంచి పుట్టిన నాయకుడు కేసిఆర్‌. జనం కోసమే పార్టీ పెట్టి, జనం ఆకాంక్షను బలమైన గొంతుగా చేసుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. అరవై ఏళ్ల గోసను తీర్చేందుకు కంకణం కట్టుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పట్టిన పట్టు విడవకుండా, సడలకుండా, ఎన్ని అవరోధాలెదురైనా నమ్మిన సిద్దాంతం కోసం నిలబడిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ప్రజల ఆకాంక్షం కోసం, వారి కలల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఇలాంటి త్యాగాల చిరిత్ర దేశంలో ఏ నాయకుడికి లేదు. పార్టీల చరిత్రలో వాటి వేలు పట్టుకొని ఎదిగిన నేతలే అందరూ…నాయకత్వం కోసమే రాజకీయం చేసిన వారే అందరూ… పదువుల పందేరంలోనే నడిచిన నాయకులే అందరూ..కాని జనం కోసం నిలిచిన ఏకైక నాయకుడు కేసిఆర్‌…జనం కోసమే నాయకుడైన గొప్ప త్యాగధనుడు కేసిఆర్‌. అందుకే ఆయన అవసరం దేశానికి కూడా వచ్చింది. దేశంలో జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అర్హత వున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌…ఆయనతో పోల్చుకునేందుకు ఏ నాయకుడికి అర్హత లేదు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *