ఫస్ట్‌ వికెట్‌…దానం టికెట్‌ కట్‌!?

ఎవరినీ పట్టించుకున్నది లేదు?

సమన్వయం చేసుకొని కలుపుకుపోయింది లేదు?

కార్పోరేటర్లకు విలువిచ్చింది లేదు?

ఉద్యమ కారులకు మేలు చేసింది లేదు?

వ్యాపారం, రాజకీయాలు తప్ప ప్రజల గురించి ఆలోచించింది లేదు?

నాయకులను కాపాడుకున్నది లేదు?

పార్టీలోని వారికే పొగపెడుతుంటే పార్టీ పెద్దలు పట్డించుకున్నది లేదు ?

గురువులకు పంగనామాలు కొత్త కాదు?

కారును ముంచుతున్నా చూస్తూ ఊరుకోవడం పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు?

ఒక్కొక్కరుగా అందరూ దూరమైతే దానం నిలకడ తెలియంది కాదు?

 పార్టీలో గుసగుసల సారాంశమిదే?

                            అయిన వారిని గుమ్మం ఆవల వుంచి, కాని వారిని కంచాల దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏమౌతుందో అందరకీ తెలిసిందే…! మన వాడు మన మేలు కోరుతాడు…పరాయి వాళ్లను పక్కన పెట్టుకున్నా వాళ్ల మేలే చూసుకుంటారు? ఎంత భుజాల మీద ఎత్తుకున్నా, ఎప్పుడు జారిపోతారో తెలియదు? ఎంత అభద్రతాభావంలో వుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత నమ్మినా అనుమానపు చూపులే చూస్తుంటారు? ఇది జీవిత సత్యం. ఇవే రాజకీయాలకు కూడా అన్వయమౌతాయి. పార్టీలలో కల్లోలం నింపుతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని నియోజకవర్గాలలో ఇలాంటి పరస్ధితి నెలకొని వుంది. అందులో మొదటి స్ధానంలో ఖైరతాబాద్‌ వుంది. అని సాక్ష్యాత్తు పార్టీకి చెందిన కార్యకర్తలే అనుకుంటున్నారు. నాయకులు బాధపడుతున్నారు. అందుకే ఈ మధ్య ఏకంగా ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తోనే ఓ ప్రజాప్రతినిధి ఎలాగూ ఓడిపోతున్నావు లే…ఇక తిరగడమెందుకు? దండగ అని ముఖం పట్టుకొని అన్నట్లు పార్టీలో పెద్దఎత్తున చర్చ సాగుతోంది. ఈ మాట విన్న దానం ఒక్కసారిగా షాకైనా, ఔననలేక, కాదనలేక, ఆ ప్రజా ప్రతినిధికి ఎందుకు ఎదురుపడ్డారో అర్ధంకాక తలదించుకొని వెళ్లిపోయారట. లోలోన తిట్టుకుంటూ అక్కడినుంచి జారుకున్నారట. ఇది గడచిన కొద్ది రోజులకే మరో ప్రజాప్రతి కూడా ఇదే మాట దానం మొహం మీదే చెప్పేశారట. ఈ సంగతి ఆనోట, ఈనోట పడి నానుతుండంతో దానం దిద్దుబాటు చర్యలకు దిగాలనుకున్నట్లు కూడా కొందరు చెప్పుకుంటున్నారు. కాకపోతే జరగాల్సినంత నష్టం ఎప్పుడో జరిగిపోయిందనేది చాలా మంది చెబుతున్న మాట. నోరు తెరిస్తే చాలు బూతుల పురాణమే దానంది అంటారు. అలాంటి దానం నోటి నుంచి ఒక్కసారిగా వినయపూర్వక విజ్ఞాపనలు వినిపిస్తుండడం విచిత్రంగా వుందట. పైగా గొర్రెలు కసాయి వాన్ని కూడా ఇలాగే నమ్ముతాయని చెప్పుకోవడానికి కూడా పనికొస్తాయని చెప్పుకుంటున్నారట. ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగేళ్ల కాలంలో ప్రజలకు అందుబాటులో వున్నదే లేదని అనేక మంది చెప్పుకుంటున్న మాటే. ఏవరినీ దరి చేjరనీయలేదు. ఎవరికీ మేలు చేయలేదు? ఆఖరుకు కరోనా సమయంలో ఎమ్మెల్యే ఎవరినీ ఆదుకున్నది లేది భహిరంగంగానే నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌లో చేరినప్పుడు అందరినీ సమన్వయం చేసుకుంటానని, అందరినీ కలుపుకుపోతానని చెప్పినా ఆచరణలో చూపించలేదన్నది నాయకులు అంటున్న మాటే. స్ధానికంగా ఖైరతాబాద్‌ నియోజవర్గ పరిధిలో టిఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు నలుగురున్నారు. వారిని ఏ ఒక్కనాడు సమన్వయం చేసుకుంటూ, వారి పనులు చేసి పెట్టింది లేదన్న మాటలే చెప్పుకుంటున్నారు. కనీసం కార్పోరేటర్లకు గౌరవం కూడ ఎమ్మెల్యే ఇవ్వరనే తెలుస్తోంది. ఇక ఉద్యమ కారులను ఉద్యమ సమయంలో ఎలా చూశారో, ఇప్పుడూ అలాగే చూస్తారని అంటున్నారు. వారికి కనీసం విలువ కూడా ఎమ్మెల్యే వద్ద వుండదని చెబుతున్నారు? ఎంత సేపు వ్యాపారాలు, రాజకీయాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, వారికి అందుబాటులోవున్నది లేదని ప్రజలంటున్నారు.

                  ఆయన అసలు తెలంగాణ ఉద్యమ కారుడు కాదు..

తెలంగాణ వాది అసలే కాదు…తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న కాలంలో విద్యార్ధులపై లాఠీ రaులిపించిన నాయకుడు. మంత్రిగా వుంటూ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుడు. తెలంగాణ వద్దని, ఒకవేళ తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌ యూనియన్‌ టెరిటరీ చేయాలని డిమాండ్‌ చేసిన నాయకుడు. 2014లో ఓటమి పాలయ్యాడు. టిఆర్‌ఎస్‌ మీద అనుక్షణం విరుచుకుపడుతూ వుండేవారు. అయినా ఆయనను టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. 2018లో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చారు. దానం మళ్లీ గెలిచాడు. కాకపోతే ఆయన పార్టీ నేతలతో అంటకాగింది లేదు. వారిని ఆదరించింది లేదు. పార్టీని బలోపేతం చేసింది లేదు. పార్టీని కంచుకోటగా చేసుకున్నది లేదు. పూర్తిగా ఇది నా పార్టీ అన్న అభిమానం పూర్తిగా నిండలేదు? అందుకే ఎవరికీ కాని నాయకుడయ్యాడు…అందర్నీ దూరం చేసుకున్నాడు…ఎవరూ తనకు ఎదరు లేకుండా చేసుకుంటున్నాన్న భ్రమల్లో పార్టీకి చేటు చేస్తున్నాడు. 

                   ఇక కరోనా కాలంలో ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియలేదని, ఆయన ఎవరికీ ఏ మేలు చేసింది లేదంటున్నారు.

 తెలంగాణలో అనేక నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కరోనా సమయంలో ఎంతో చేస్తే, దానం కనీసం నియోజకవర్గం కూడా కలియ తిరిగింది లేదంటున్నారు. సాక్ష్యాత్తు మంత్రి కేటిఆర్‌ సైతం రెడ్‌ జోన్లలో తిరిగిన సందర్భాలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కాని దానం తిరిగిన రోజులే లేవంటున్నారు. ఇక సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ఎంతో మందికి కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన సందర్భం గుర్తు చేసుకుంటున్నారు. కాని దానం చేసిన దానమే లేదంటున్నారు. 

        ఇదిలా వుంటే పార్టీలోనే నాయకుల మధ్య చిచ్చుపెడుతూ, ఒకరినొకరికి దూరం చేస్తూ, చివరికి పార్టీకే వారిని దూరం చేస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు.

 దానం గురువులకు పంగనామాలు పెట్టడం కొత్త కాదని, ఇది మొదటిది కాదంటున్నారు. గతంలో చేయిచ్చి ఆదుకున్నంత కాలం కాంగ్రెస్‌లో వుండి, ఒక్కసారిగా టిక్కెట్టు దక్కపోతే రాత్రికి రాత్రి సైకిలెక్కి, గెలిపించిని పార్టీని నట్టేట ముంచిన ఘనత దానం రాజకీయం మన కళ్లముందే వుందంటున్నారు. ఎంతో నమ్మకంతో కాంగ్రెస్‌ మళ్లీ చేరదీస్తే మంత్రిని చేస్తే, పదవి లేకుండా వుండలేని దానం, కారెక్కారు. ఎమ్మెల్యే అయ్యారు. కాని ఇక్కడా ఎవరినీ కలుపుకుపోయినట్లు ఎవరూ చెప్పుకోవడం లేదు? ఎవరూ సంతృప్తిగా లేదు. దానం ఎమ్మెల్యే కాకముందు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో 6గురు టిఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు వుండేవారు. దానం ఎమ్మెల్యే అయ్యాక ఆ సంఖ్య నాలుగుకు చేరింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయి వుండి కూడా కార్పోరేటర్లను గెలిపించుకోలేదన్న అపవాదు వుండనే వుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా బిజేపి వున్నప్పుడే టిఆర్‌ఎస్‌ 6 కార్పోరేటర్లను గెల్చుకుంటే, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానంతో ఆ సంఖ్య పదిలం కావాలి. మెజార్టీ మరింత పెరగాలి. కాని అందులో రెండు సీట్లు పోయినవి అంటేనే దానం చతురుత, చాణక్యం, అంకితభావం ఎంతో ఇక్కడే చెప్పేయొచ్చు అంటున్నారు. అంతే కాదు గత జిహెచ్‌ఎంసి ఎన్నికల నుంచి కార్పోరేటర్లతో సఖ్యత అన్నది ఆయన డిక్షణరిలోనే లేదన్నది విజయారెడ్డిపార్టీ మారడంతోనే అర్ధమైందన్న సంగతి చెప్పేయొచ్చు. ఓ వైపు పార్టీలో ఎక్కడ లుకలుకలు అన్న విషయం తెలిస్తే చాలు అక్కడకి చేరుకొని సంబంధిత నాయకులతో మంతనాలు జరుపుతూ పార్టీలో విభేదాలు లేకుండా కేటిఆర్‌ చూసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య ఖమ్మం వెళ్లారు. అక్కడ పరిస్ధితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కొల్లాపూర్‌ వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మంతనాలు జరిపారు. కాని ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో వున్న అసంతృప్తిని దానం పట్టించుకోలేదు. విజయారెడ్డి పార్టీకి దూరమయ్యే పరిస్ధితి తెచ్చారు. ఆమె ఈ మధ్య మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే దానం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పిందే కాని, ఎక్కడా ప్రభుత్వం మీద విమర్శలు చేయలేదు. విజయారెడ్డి పార్టీని వీడడంతో మరికొంత మంది కార్పోరేటర్లు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమౌతున్నారని సమచారం. వారు ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం వుందన్న సంగతైనా ఎమ్మెల్యే పార్టీ పెద్దలకైనా తెలపాల్సివుంది. కాని ఆ పని కూడా చేయడంలేదు. దాంతో వుంటే దానమైనా వుండాలి? లేకుంటే మేమైనా వుండాలన్న పట్టుదలతో కొందరు సీనియర్‌ నాయకులు, కార్పోరేటర్లు వున్నట్లు తెలుస్తోంది. దాంతో దానంను పక్కన పెట్టేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునేలా వుందనేది తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం…దానం టికెట్‌ కట్‌ అన్నది తెలుస్తోంది. అదే జరిగితే టిఆర్‌ఎస్‌ నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని కూడా అంటున్నారు…ఏం జరుగుతుందో వేచి చూడాలి?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*