పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి : పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుబ్బ మల్లన్న ప్రాంతంలో శీతలీకరణ కేంద్రం నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించడంతో పాటు 30 లక్షలతో నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం రైతులతో కెవికెలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జమ్మికుంట బీఎంసీయూలో పాలు పొసే పాడి రైతులను ఆదుకుంటామన్నారు. వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన నాలుగు రూపాయల ప్రోత్సాహం త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. విజయ డెయిరి చైర్మన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమలను చేపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, విజయ డైయిరి డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ సింగ్, స్పెషల్ ఆఫీసర్ సింహరావు, బీఎంసీయూ ఇంచార్జి సతీష్, కేవీకేల్ ప్రొపెసర్ ప్రభాకర్, తెరాస నాయకులు రాజారామ్, పాడి కౌశిక్ రెడ్డి, చుక్క రంజిత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *