దృతరాష్ట్రుడు కళ్లు తెరిచాడు? ‘‘అల్లం’’ జర్నలిస్టులకు ‘‘మేలు చేస్తాడా’’.!

https://epaper.netidhatri.com/view/299/netidhathri-e-paper-21st-june-2024%09

‘‘అల్లం’’ జర్నలిస్టులకు ‘‘మేలు చేస్తాడా’’.!

ఖమ్మంలో అల్లం గ(ఒ)ట్టి ప్రతిజ్ఞ!

పదేళ్లకు ఇండ్లు గుర్తొచ్చాయా!

జర్నలిస్టు సమస్యల మీద పోరాటం చేస్తావా!

అక్రిడిటేషన్లు ఇప్పించలేని అసమర్థుడు అల్లం!

కుర్చీలో కూర్చొని కుయ్యి మనని అల్లం ఉద్దరిస్తాడా!

పదవి కోసం పాకులాడే అల్లం జర్నలిస్టులకు మేలు చేస్తాడా!

కుర్చీ పట్టుకొని వేళాడిన వ్యక్తి మాటలు నమ్మమంటారా!

తెలంగాణ పత్రికలకు అన్యాయం చేసిందే అల్లం.

తెలంగాణలో ఆంద్రా పత్రికలకు పెద్ద పీట వేసినప్పుడు ఏడున్నావ్‌!

కళ్లు మూసుకొని జపం చేశావా!

ఎందకూ పనికి రాని పత్రికలను అప్‌ గ్రేడ్‌ చేసినప్పుడు ఏం చేశావ్‌.

జర్నలిస్టులకు అండగా నిలిచింది లేదు.

జర్నలిస్టులకు మేలు చేసింది లేదు.

నికార్సైన తెలంగాణ పత్రికలను బతికించాలన్న సోయి లేదు.

ఉద్యమం పేరు చెప్పి పబ్బం గడుకొన్నావు.

పదేళ్లు పదవి పట్టుకొని వేళాడావు.

బిఆర్‌ఎస్‌ ను దుమ్మెత్తి పోస్తుంటే గుడ్లప్పగించి చూశావు.

ప్రభుత్వ పథకాలను ఏనాడైనా రాశావా!

జర్నలిస్టులలో అవగాహన కల్పించావా!

అకాడమీ ద్వారా ఎంతమంది జర్నలిస్టులకు మేలు చేశావు.

బీఆర్‌ఎస్‌ కు ఏనాడైనా అండగా నిలిచావా!

జర్నలిస్టు సంక్షేమం పట్టించుకున్నావా?

కనీసం జర్నలిస్టుల హెల్త్‌ కార్డుల అమలు జరిగేలా చూశావా!

వడ్డించే అవకాశం వున్నప్పుడు దాక్కున్నావు.

జర్నలిస్టుల అండగా నిలవాల్సిన సమయంలో కళ్లు మూసుకున్నావు.

తీయాల్సిన సమయంలో ముసుగు కప్పుకున్నావు.

ఇప్పుడు అల్లం కళ్లు తెరిచినా ఎవరూ నమ్మరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అభినవ దృతరాష్ట్రుడు కళ్లు తెరిచాడు? హఠాత్తుగా పదేళ్ల తర్వాత నిద్ర లేచాడు? ఏమైంది నా సామ్రాజం? ఎటు పోయింది నా మంది మార్భలం? ఏం జరగుతోంది నా రాజ్యంలో? జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారా? ఇండ్లు లేక బాధపడుతున్నారా? హెల్త్‌ కార్డులు పనిచేయక ఆగమౌతున్నారా? కనీసం అక్రిడిటేషన్లు లేక గుర్తింపు కోల్పోతున్నారా? తెలంగాణ పత్రికలు గోసపడుతున్నాయా? అయితే పదండి? పదండి!! ముందుకు పోరాటం చేద్దాం? ఉద్యమాలు చేద్దాం? మన హక్కుల కోసం పోరాటం చేద్దాం? నేను ముందుండి కొట్లాడుతా? అందరికన్నా ముందు నేనే గళం విప్పుతా? ప్రభుత్వం మీద యుద్దం చేస్తా? ఈ మాటలు వింటే నవ్వొస్తుందా? కడుపార నవ్వుకోండి! అల్లం నారాయణను చూసి జాలి పడండి! కోపం తెచ్చుకోకండి!!అలాగే వుంటుంది. కొందరి మాటలు..చేతలు! పదేళ్ల తర్వాత అల్లం నారాయణకు మెలుకు వచ్చినట్లుంది. తెలంగాణ కొత్తగా కనిపిస్తోంది. అలా అప్పుడప్పుడు నేను నాయకుడిని అని గుర్తు తనకు తాను గుర్తుకు తెచ్చుకోవడానికో…నేను నాయకుడిని ఒకడినున్నానని జనానికి చెప్పడానికో ఇలాంటి మాటలు చెబుతుంటారు. తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు? ముందుగా అల్లం నారాయణ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వుంది. అల్లం నారాయణ జర్నలిస్టు నాయకుడా? లేక కేవలం తెలంగాణ ఉద్యమ కారుడా? ఇది జర్నలిస్టులకు అర్ధం కావాల్సిన అవసరం వుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పేరుతోనే వెలుగులోకి వచ్చిన నాయకుడు అల్లం నారాయణ. మరి ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల కోసం ఏనాడు పోరాటం చేసింది లేదు. తాను చెప్పుకుంటాడామో! కాని జర్నలిస్టులు అంగీకరించాల్సిన అవసరం వుంది. ఎందుకంటే పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్టులకు ఆనాడు పోరాటం చేసి అల్లం నారాయణ అందించిన ఫలాలు లేవు. తెలంగాణ పత్రికల మనుగడకు ఆయన చేసిన సాయం లేదు.
తెలంగాణ పత్రికల మనుగడ కోసం పోరాటం చేసింది అసలే లేదు.
ఆయన దృష్టిలో తెలంగాణ పత్రికలు పత్రికలే కావు. కనీసం కరపత్రికలు కూడా కావు. తెలంగాణలో ఆంద్రా పత్రికల పెత్తనాన్ని ఆయన ఆయా పత్రికల్లో పనిచేసినప్పుడు ప్రశ్నించిందిలేదు. నమస్తే తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా ఆయన జర్నలిస్టుల సమస్యలు పట్టించుకున్నది లేదు. తెలంగాణ ఉద్యమ ప్రస్ధానంలో జర్నలిస్టుగా గుర్తింపు కోసం పాకులాడడంతప్ప జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేసింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్‌గా తెలంగాణ పత్రికలకు ఏదైనా సాయం చేశాడా? అంటే అదీ లేదు. అకాడమీ ద్వారా కొత్త జర్నలిజానికి ఊరిపి పోశాడా? అంటే అది కూడా లేదు. పదేళ్ల కాలంలో ఏనాడైనా జర్నలిస్టుల మహాసభలు పెద్దఎత్తున నిర్వహించాడా అంటే ఒక్కటీ లేదు. ఆ సభలకు ఏ ఒక్కనాడైనా కేసిఆర్‌ రప్పించాడా? లేదు! కనీసం మంత్రులను పిలిపించాడా? లేదూ! సభలే పెట్టనప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమేకాదు! మరి ఏం చేసినట్లు? తెలంగాణ జర్నలిస్టులను ఎప్పుడైనా దేశంలోని ఇతర రాష్ట్రాలలో అధ్యయనం కోసం పంపించావా? అదీ లేదు. కనీసం అల్లం నారాయణైనా తెలంగాణ రాష్ట్ర్ర స్దితి గతులపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాడా? అంటే అదీ లేదు. జర్నలిస్టుల కోసం ఏటా అధ్యయన సదస్సులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. పదేళ్ల పాటు అకాడమీ చైర్మన్‌గా వుండి ఏం చేసినట్లు? ఫలానా జిల్లాలో వున్న జర్నలిస్టులందరకీ ఇండ్లు ఇప్పించావా? లేదు! జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్‌ కార్డులు పనిచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించావా? అదీ లేదు. పదేళ్ల కాలంలో ఒక్కసారైనా కేసిఆర్‌తో కలిసి చర్చలు జరిపావా? జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించావా? జర్నలిస్టుల సమస్యల మీద అధ్యయనం చేశావా? ఇందులో ఏ ఒక్కటికీ అల్లం దగ్గర సమాదానం లేదు. పదేళ్లపాటు అకాడమీ చైర్మన్‌గా వుండి దేశంలో ఏ రాష్ట్రంలో జర్నలిస్టులకే లేని ప్రత్యేక సదుపాయాలు తెలంగాణకు సాధించావా? ఇప్పుడు పోరాటం చేస్తావా? జర్నలిస్టులను నమ్మమంటావా? అప్పుడో ఇప్పుడో కేటిఆర్‌తో కలవడం, మాట్లాడినట్లు,సమస్యలు తీరినట్లు ప్రెస్‌నోట్లు పంపించి చేతులు దులుపుకోవడం తప్ప ఏం చేసినట్లు? తెలంగాణ పత్రికలకు కనీసం అక్రిడిటేషన్లు ఇప్పించేందుకు చొరవ తీసుకున్నది లేదు. కనీసం పదేళ్లలో ఎంపానల్‌ మెంట్లు కూడా పూర్తి చేయలేదు. నికార్సైన తెలంగాణ పత్రికలను గ్రేడ్‌లు ఇప్పించలేదు.
ఆంద్రా మీడియాలో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులను రాత్రికిరాత్రి రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించలేదు.
వారికి అండగా నిలవలేదు. ఈ పదేళ్ల కాలంలో ఎన్నొ ఛానళ్లు మూత పడ్డాయి. అందులో పనిచేసి ఎంతో మంది జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. వారికి న్యాయం జరిగేందుకు ఏనాడైనా ఆయా యాజమాన్యాలతో చర్చలు జరిపావా? జర్నలిస్టులకు న్యాయం చేశావా? సాక్షి లాంటి పత్రికలో రాత్రికి రాత్రి జర్నలిస్టులను తొలగిస్తే ఏం చేశావు? సాక్ష్యాత్తు నమస్తే తెలంగాణలో కూడా ఇదే పరిస్దితి ఎదురైతే మాట్లాడిన సందర్భం వుందా? జీతాలు పెంచమని అడిగిన పాపానికి నమస్తే తెలంగాణ నుంచి జర్నలిస్టులను తొలగిస్తే వారికి అండగా నిలబడ్డావా? జర్నలిస్టు సమాజానికి ఏం చేసినట్లు? పదేళ్ల పాటు బిఆర్‌ఎస్‌ పార్టీ గుర్తించి పదవి ఇస్తే కనీసం పార్టీ కోసమేమైనా చేశావా? పార్టీకి ఇండగా నిలబడ్డావా? ఏనాడైనా బైటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశావా? పదవిలో వుండి ఏ పార్టీకి వత్తాసు పలకొద్దనే నిబందన వుందని తప్పించుకునే ప్రయత్నం చేశావా? ఒకప్పుడు స్పీకర్లు ఎక్కడా రాజకీయాలు చేసేవారు కాదు? కాలం మారింది? వారు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. గవర్నర్లు కూడా రాజకీయాల్లో వేలు పెడుతున్నారు. జర్నలిస్టు అకాడమీ చైర్మన్‌గా వుండి కనీసం జర్నలిస్టుసమస్యల మీద కూడా మాట్లాడలేని అల్లం నారాయణ ఇప్పుడు చిలకపలుకులు పలుకుతుంటే వినమంటారా? అమాయకులైన జర్నలిస్టులు నమ్మమంటారా? కేసిఆర్‌ పాలనతో తెలంగాణ ఆగమైందని అటు రాజకీయ పార్టీలు, ఇటు ఆంద్రా మీడియా ప్రశ్నలు వేసినప్పుడు నిజానిజాలు చెప్పే జర్నలిస్టుగా ఏం చేసినట్లు? తెలంగాణ పత్రికలతోనైనా సంప్రదించి తెలంగాణ ప్రగతి మీద వార్తలు రాయించావా? కనీసం రాసిన నేటిధాత్రిలాంటి పత్రికలను గుర్తించావా? నిత్యం నేటిధాత్రి తెలంగాణ ప్రగతిని ఆవర్కిరిస్తుంటే చూడలేదా? నేటిధాత్రి నీ కంటికి పత్రికలా కనిపించలేదా? ఆంధ్రా పత్రికలు తెలంగాణ మీద విషం చిమ్ముతుంటే కళ్లు మూసుకున్నావు. తెలంగాణ ప్రగతి మీద, గతంలో జరిగిన విద్వంసం మీద, తెలంగాణ కనిపిస్తున్న వెలుగుల మీద నేటిదాత్రి వర్తాలు కనిపించలేదా? పదేళ్ల పాటు కుర్చీలో కూర్చొవడానికి, పదే పదే పదవికాపాడుకోవడానికి మాత్రం కేసిఆర్‌ అప్పాయింటుమెంటు ఇచ్చాడా? జర్నలిస్టుల సమస్యల మీద మాట్లాడడానికిమాత్రం సమయం ఇవ్వలేదా?
కొత ప్రభుత్వం వచ్చి పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు.
ఈ ఆరు నెలల్లో నాలుగు నెలలు ఎన్నికల కోడ్‌తోనే పుణ్య కాలం గడచింది. ఈ ఆరు నెలల్లోనే జర్నలిస్టుల సమస్యలు ఆగిపోయాయా? పదేళ్లలో కనిపించని జర్నలిస్టు సమస్యలు అల్లం నారాయణకు మెలుకవ రాగానే కనిపించాయా? కనీసం జనం నవ్వుతారన్న సోయి కూడా లేకుండాపోయిందా? అల్లం అకాడమీ చైర్మన్‌గా వున్నప్పుడు కనీసం సమాచార శాఖ బాధ్యతలు ప్రత్యేకంగా ఓ మంత్రికి ఇవ్వమని డిమాండ్‌ చేసిన సందర్భం కూడ లేదు. ఇప్పుడు సమచార శాఖ మంత్రివున్నారు. నిత్యం జర్నలిస్టులతో కలుస్తున్నారు. జర్నలిస్టుల సమస్యలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వింటున్నారు. ఇలాంటి సమయంలో అల్లం లాంటి వాళ్లు మాట్లాడడం కన్నా, మౌనంగా వుండడమేమేలు. పదేళ్లు ఉలుకూ పలుకు లేని అల్లం ఏది మాట్లాడిన అవి చెల్లని మాటలే అవుతాయి. తన పదవి కోసం జర్నలిస్టుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన అల్లానికి మాట్లాడే అర్హత లేదు. అసలు ఆ హక్కే లేదు. పదేళ్లు జర్నలిస్టుల గురించి మాట్లాడని అల్లం జర్నలిస్టు అనడానికి అవకాశమేలేదు. అటు బిఆర్‌ఎస్‌కు న్యాయం చేయలేదు. ఇటు జర్నలిస్టులకు ఉపయోపగడలేదు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని జర్నలిస్టుల ముందుకు వచ్చావో కనీసం నీ ఆత్మ సాక్షిని అడుగు…నిజం అదే చెబుతుంది. అవసరమైతే బుద్దిచెబుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *