Gandra Couple Anniversary Celebrated
ఘనంగా గండ్ర దంపతుల వివాహ వార్షికోత్సవం
సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి వివాహ వార్షికోత్సవ వేడుకలను బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి గండ్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
