చలో వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వాల్ రైటింగ్ కార్యక్రమం ప్రారంభం
జహీరాబాద్ . నేటి ధాత్రి:
27న వరంగల్‌లో జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ప్రారంభించారు. సభకు పూర్వాహ్నం నుంచి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టబడింది అని.

వాల్ రైటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా జహీరాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహీ ఉద్దీన్,తులసి దాస్ గుప్తా,యువ నాయకులు మిథున్ రాజ్ ,ప్రభు ,
ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ విజయ రథాన్ని ముందుకు నడిపేందుకు ప్రతి కార్యకర్త ఈ రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మల్యే మాణిక్ రావు గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.