2వ రోజు వారోస్తావాలు
బస్టాండ్ లో ప్రజలకు అవగాహన కోసం ఫైర్ డెమో ప్రదర్శన
ప్రజలు,వ్యాపారస్థులు అప్రమత్తంగా ఉండాలి
ఫైర్ అధికారి వక్కల భద్రయ్య
పరకాల నేటిధాత్రి
పరకాల బస్టాండ్ లో మంగళవారం ఫైర్ అధికారి వక్కల భద్రయ్య అధ్వర్యంలో 2వరోజు వారోత్సవాలు నిర్వహించారు.పట్టణ కేంద్రంలోని బస్టాండ్ లో ప్రయానికులకు,స్థానికులకు అవగాహన కల్పించేందుకు ఫైర్ డెమో ప్రదర్మించారు.ఈ సందర్బంగా భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని వ్యాపారస్తులు అగ్నిప్రమాదం సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై కరపత్రాలు పంపణీ చేశారు.బస్టాండ్ ఆవరణలోని పలుచోట్ల వారోత్సవాల పోస్టర్ ఏర్పాటు చేశారు.అగ్నిపమాదం నివారించేందుకు పాటించాల్సిన జాగత్త చర్యలపై అవగాహగా లేక నిర్లక్ష కారణాల వల్లే అగ్నిప్రమాదాలు సంభవిస్తాయన్నారు.అగ్ని ప్రమాదం జరిగితే అపుడు మనదేశ సంపదను కోల్పోయిన వారిగా మిగిలిపోతామున్నారు.ఇప్పటికైనా వ్యాపారాస్తులు అగ్నిమాపక సిబ్బండి సూచనలు పాటిస్తూ,తమ అస్తులను పరిరక్షించుకోవాలన్నారు.వ్యాపారస్థులు ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సన అవసరం ఉందని గుర్తుచేశారు.వారి వెంట పరకాల అగ్నిమాపకశాఖ కార్యాలయం సిబ్బంది ఎల్ఎఫ్ కృష్ణకుమార్, డ్రైవర్ సత్తయ్య, అన్నిమాపకులు సత్యం,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.