డివిజన్ స్థాయిలో ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )
https://youtu.be/0nRB-Xx_k3A?si=cHTOLx8tYGUXzZVg
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం(ఐడీఓసీ)లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణితోపాటు డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రతీ సోమవారం ఆర్డీఓలు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రతీ సోమవారం నిర్వహించే డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
