వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో అక్రిడేషన్ లేని వివిధ దినపత్రికలలో ఎలక్ట్రానిక్ చానల్స్ లో పనిచేసే విలేకరులకు వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని అక్రిడేషన్ లేని విలేకరులు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో శ్రీనివాసపూర్ శివారులో సర్వే నెంబర్ 55 విలేకరు లకు ఇళ్ల స్థలాలు కేటాయించారు అప్పట్లో విలేకరిగా పని చేస్తున్నారా లేదా అని విచారణ చేయకుండా అధికారులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ప్లాట్లు రాని విలేకరులు జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డికి ఫిర్యాదులు చేశారు వనపర్తి పట్టణంలో ప్లాట్లు రా ని విలేకరులను గుర్తించి అక్రిడేషన్ కార్డ్ కు సంబంధం లేకుండా విలేకరిగా పనిచేస్తున్నారా లేదా అని అధికారులు ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి విచారణ చేసి కేటాయించాలని ప్లాట్లు రా ని విలేకరులు కోరారు