Ugadi Diary 2026 Launched in Warangal
వరంగల్ ఐజేయూ ఆధ్వర్యంలో ఉగాది డైరీ ఆవిష్కరణ
వరంగల్, నేటిధాత్రి.
టీయూడబ్ల్యూజే (ఐజేయు) వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించిన “ఉగాది పరాభవనామ సంవత్సరం డైరీ–2026”ను రాష్ట్ర దేవాదాయ, అటవీ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగు సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా డైరీని రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. వరంగల్ ఐజేయూ యూనియన్ తీసుకున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
అలాగే వరంగల్ యూనియన్ కమిటీని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాం రామచందర్, ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
