ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు అదృశ్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
నిజాంపేటలో చదువుతున్న ఇంటర్ విద్యార్థినులు 15న హాస్టల్కు వెళ్లేందుకు బస్సు ఎక్కి లింగంపల్లి వద్ద దిగారు. సాయంత్రం కళాశాలకు చేరినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్లో చెప్పారు. అయితే, 18న బాలికలు హాస్టల్కు రాలేదని కళాశాల అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు జహీరాబాద్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు.
