కరపత్రం ఆవిష్కరణ
కొత్తగూడ,నేటిధాత్రి:
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఉమ్మడి వరంగల్ జిల్లా మహా సభ ను విజయవంతం చేయవంతం చేయాలనీ శనివారం రోజు కొత్తగూడ మండల కేంద్రం లోని ఆదివాసీ ల ఆశా జ్యోతి పోరాట యోధుడు కొమరం భీమ్ కూడలి లో మహా సభ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ నెల 12 వ తేదీన నిర్వహణ చేయాల్సిన ఈ మహాసభ ను అనివార్యకారణాల వల్ల తేదిని మార్పు చేస్తూ ఈ నెల 23వ తేదీన ఉదయం 11:30 నిముషాలకు హన్మకొండ లోని గిర్జన భవన్ లో నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తుడుందెబ్బ నాయకత్వం ఈ కార్యక్రమం ను విజవంతం చేసేందుకు సంసిద్ధం కావాలని రాష్ట్ర కో- కన్వీనర్ ఆగబోయిన రవి,పిలుపునిచ్చారు కార్యక్రమం లో జిల్లా కో కన్వీనర్లు కుంజ నర్సింగరావు,వాసం రవి,అలెం జంపయ్య,మండల కన్వీనర్ ఈక విజయ్ కుమార్,కో కన్వీనర్ వజ్జ రవి సిద్దబోయిన లక్ష్మి నారాయణ లు పాల్గొన్నారు.