5 మంది వడ్డెర విద్యార్థులకు ఉచితంగా సివిల్ ఇంజనీరింగ్ చదివిస్తా..
కుల వృత్తే కాదు కాంట్రాక్టర్లుగా ఎదగాలి..
మున్సిపాలిటీ నుంచి ఓబన్న విగ్రహాం ఏర్పాటు కోసం ₹ 5 లక్షలు..
ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
భవిష్యత్తు తరాలకు వడ్డే ఓబన్న వీర గాధ అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వడ్డెర ఓబన్న 218 వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలో అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆయన గుర్తు చేశారు. బహుజన యుద్ధ వీరుల సహాస గాధలను మనం స్మరించుకోవాలని వారు ప్రజలకోసం చేసిన త్యాగాలను సదా గుర్తుంచుకోవాలి అని ఆయన చెప్పారు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ లో 5 మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ అభివృద్ధి కి పునాది రాయి వేసిన వడ్డెర జాతి అభ్యున్నతికి అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు. మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క విగ్రహం ఏర్పాటు కోసం 5 లక్షల రూపాయల అందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డిసిసి కార్యదర్శి టంకర కృష్ణయ్య, పట్టణ క్రిస్టియన్ మైనారిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామ్యూల్ దాసరి, మైనారిటీ నాయకులు ఫయాజ్, నాయకులు వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు..