Sarpanches Key to Welfare Scheme Delivery
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత సర్పంచులదే
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో మండల స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రాణాలిక సమావేశాన్ని ఎంపీడీవో నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య సిపిఓ జోహార్ లాల్ నాయక్ హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రాణాలిక కార్యక్రమాన్ని సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి గ్రామాలలో ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి అందరూ లబ్ధి పొందే విధంగా సర్పంచులు చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని వారు అన్నారు అలాగే
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుచున్న వివిధ సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకము, గృహజ్యోతి, సన్నరకం బియ్యనికి బోనస్, చేయూత పెన్షన్, కళ్యాణలక్ష్మి/ షాదీముభారక్, ఇందిరా మహిళా శక్తి వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరెలు, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వివిధ నిధుల క్రింద పనుల మంజూరీ తదితర అంశముల పై చర్చించడం జరిగింది గ్రామాలలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు చొరవ చూపాలని వారు అన్నారు ఈ కార్యక్రమాలు సిపిఓ జోహార్ లాల్ నాయక్ ఎస్ఐ గీత రాథోడ్ వివిధ గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడి టీచర్స్ తదితరులు పాల్గొన్నారు
