Yakanne Elected Goud Society President
గౌడ సంఘం సోసైటీ అధ్యక్షుడిగా గంధసిరి యాకన్నా ఏకగ్రీవ ఎన్నిక
కేసముద్రం/ నేటి ధాత్రి
అర్పణపల్లి గౌడ సంఘం సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నిక గ్రామంలోని గౌడ సంఘం కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ ఎన్నికలో సొసైటీ అధ్యక్షునిగా గంధసిరి యాకన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.` ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు గంధసిరి యాకన్నా మాట్లాడుతూ, “నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న గౌడ సంఘం సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సొసైటీ అభివృద్ధికి, కులస్తుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తాను. విద్య, ఉపాధి, ఆరోగ్యంతో పాటు సంఘం సభ్యులకు, గీత కార్మికులకు పింఛన్లు అందేలా కృషి చేస్తాను. అన్ని రంగాల్లో సంఘం సభ్యులకు అండగా నిలుస్తాను” అని హామీ ఇచ్చారు.` నూతన కార్యవర్గానికి కుల సంఘం పెద్దలు, సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ఐకమత్యంగా ఉండటం వల్లే ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమైందని సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గౌడ కుల పెద్ద మనిషి బుచ్చిరాములు, సారుకొల్లా గంధం సంతోష్, మాజీ అధ్యక్షులు గంధం వెంకన్న, ఉపాధ్యక్షులు గంధం శ్రీను, ప్రధాన కార్యదర్శి గంధం వేంకటాద్రి మెంబర్లు రంగయ్య, ఎల్లయ్య, ఐలయ్య, గంగాపురపు యాదగిరి, బుర్ర సుధాకర్, బబ్బురు సతీష్, కందల శ్రీకాంత్, నలమాషా రాములుతో పాటు గౌడ సంఘం పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.`
