అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉండాలి

డి ఐ జి ఎల్ ఎస్ చౌహన్ ఐపీస్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పోలీస్ అమర వీరుల స్మరించుకుంటూ పోలీసు ఫ్లాగ్ డే ను నిర్వహించే కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు కవాతు మైదానము నందు జరిగే స్మృతి పరేడ్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జోగులాంబ జోన్ డి ఐ జి ఎల్.ఎస్.చౌహన్, ఐపీఎస్ పాల్గొన్నారు.


పరేడ్ అనంతరం డి ఐ జి మాట్లాడుతూ…
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని,వారి స్ఫూర్తి నిత్యం మనతో ఉంటుందని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి సంక్షేమం కోసం అన్ని విధాలా కృషి చేస్తామని డీఐజీ తెలిపారు.
30 సంవత్సరాల కిందట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా వుండేదని, అప్పటిలో పోలీసులు విధి నిర్వహణలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు అని కొనియాడారు.


అమరవీరుల త్యాగాలను అనుక్షణం స్మరించుకోవాలి..

జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్…

గత సంవత్సర కాలంలో దేశంలో అమరులైన 214 మంది పోలీసు అధికారులు ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడి దేశ రక్షణ కోసం అమరులయ్యారని అన్నారు.ఈ పోలీసు అమరవీరుల త్యాగాలను మనమందరం అనుక్షణం స్మరించుకుంటూ దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆకాంక్షించారు.
అనంతరం అమరవీరుల స్మారక స్థూపంనికి డి ఐ జి, విశిష్ట అతిథిగా పాల్గొన్న
జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయెందిర బాయి, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ లతో నివాళులు అర్పించారు.
మహబూబ్ నగర్ జిల్లా నుండి అమరులైన వారికుటుబలతో డి ఐ జి, కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కలిసి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
ఏమైనా సమస్యలున్నా వారి కుటుంబ సభ్యులను తెలుసుకోని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
తదనంతరం పోలీసు కవాతు మైదానము నుండి స్వర్గీయ పరదేశి నాయుడు చౌక్ (1 టౌన్ పీస్ ) వరకు అమరులైన వారి త్యాగాలను సమృచుకుంటూ, నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్ స్పీ వెంకటేశ్వర్లు,జైల్ సూపరింటెండెంట్ వెకటేశం,డీసీఆర్ బీ డీఎస్ స్పీ రమణా రెడ్డి, ఏఆర్ డీఎస్ స్పీ శ్రీనివాసులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!