Rohith Sadu Appointed TPCC Health Wing Secretary
మెడికల్ అండ్ హెల్త్ వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా రోహిత్ సాదు
పరకాల,నేటిధాత్రి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెడికల్ మరియు హెల్త్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డా రోహిత్ సాధుని నియమిస్తూ టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ స్టేట్ ఛైర్పర్సన్ డాక్టర్.రాజీవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.పరకాల పట్టణానికి చెందిన రోహిత్ సాదు ప్రస్తుతం ఇండియన్ అస్సోసియేషన్ అఫ్ ఫిజియోథెరపీ జిల్లా కన్వీనర్ గా నేషనల్ హ్యూమన్ రైట్స్(ఎన్జీఓ) స్టేట్ కమిటీ మెంబర్ గా పని చేస్తున్నారు.కాగా పరకాల పట్టణంలో ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ చేస్తున్న సేవలను గుర్తించి హెల్త్ విభాగంలో రాష్ట్ర పదవి ఇచ్చినట్లు పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని హన్మకొండ లోని అయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు.ఈ సందర్భంగా రోహిత్ కు ఎమ్మెల్యే శాలువా కప్పి అభినందించి శుభాకాంక్షలు తెలియచేశారు.నిబద్దతతో పని చేసి పార్టీ అభివృద్ధికి దోహదం చేయాలనీ సూచించారు.తనకు ఈ అవకాశం రావడానికి సహకరించిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్,హెల్త్ మినిస్టర్ దామోదర రాజానర్సింహ,ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి,డీసీసీ ప్రెసిండెంట్ ఇనాగాల వెంకటరాంరెడ్డి,మెడికల్ అండ్ హెల్త్ వింగ్ స్టేట్ ఛైర్పర్సన్ డా రాజీవ్ ఇతర ముఖ్య నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి,కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తన వంతు కృషి చేస్తానని రోహిత్ కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్,డా.రమేష్, డా.రాకేష్,డా.సాయికుమార్ పాల్గొన్నారు.
