Bochu Raju Swero Joins TRS
పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పై పెంచిన ధరలు తగ్గించాలి
పేద మధ్య తరగతి ప్రజల పైన పెనుబారం మోపిన మోది.
సోతుకు.ప్రవీణ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి సరికి పేద మధ్యతరగతి ప్రజల పైన పెద్ద ఎత్తున భారం మోపిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నడు లేనివిధంగా కమర్షియల్ సిలిండర్ ధర 950 రూపాయలు పెంచడం సిగ్గుచేటు అని అన్నారు. కమర్షియల్ సిలిండర్ ధర 3500 చేరుకుందని ఈ భారం పేద ప్రజల పైన పడుతుందని తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పట్టణ కేంద్రంలో ఆందోళన పోరాటాలు జరుగుతున్నాయని అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు నిత్యావసరాలు ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని అన్నారు. ఒకప్పుడు టిఫిన్ 30 రూపాయలు ఉంటే గ్యాస్ ధరలు పెరిగాయని 50 రూపాయలు తీసుకుంటున్నారని, పెద్ద హోటల్లో అయితే జీఎస్టీ, పెరిగిన గ్యాస్ ధర పేరు మీద పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని తెలిపారు. వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, బూడిద తిరుపతి,ఎండియాకు పాషా, గోలి లావణ్య, పల్లెల రజిత, పొనగంటి లావణ్య, గడ్డం సరూప, గంప రాజు, సమ్మయ్య, గోనాల తిరుపతి, కుమార్,పాండవుల తిరుపతి, ధరావత్, చిట్యాల పద్మ తదితరులు పాల్గొన్నారు.
