May Day Celebrations Highlight Labour Welfare in Bhupalpally
కార్మికుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఐడీఓసి కార్యాలయంలోని జిల్లా కార్మిక శాఖ అధికారి వినోద ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలని,వారి కృషి వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.కార్మికుల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.కార్మికులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని,వారి సేవలను గుర్తించి గౌరవించడం మనందరి కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆర్డీఓ హరికృష్ణ జిల్లా కార్మిక, ఉపాధి శాఖ అధికారి వినోద మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ స్థానిక మున్సిపల్ కౌన్సిలర్స్, అప్పం కిషన్ బొడ్డు అశోకు కార్మిక సంఘాల జిల్లా నాయకులు కార్మికులు,తదితరులు పాల్గొన్నారు
