Parking Fee Burden at Warangal Station
వరంగల్ రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఛార్జీల భారం.
ప్రయాణికులపై పెరుగుతున్న ఆర్థిక భారం
వరంగల్, నేటిధాత్రి.
వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ ఛార్జీలు ప్రయాణికులకు భారంగా మారుతున్నాయి.
స్టేషన్ పార్కింగ్ ప్రాంగణంలో ద్విచక్ర వాహనాలకు కనీసం రూ.20 (రెండు గంటల వరకు) వసూలు చేస్తున్నారు.
రెండు గంటలు దాటిన తర్వాత ప్రతి గంటకు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు.
దీంతో రోజంతా వాహనం నిలిపితే రూ.240 వరకు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణికులకు పార్కింగ్ ఖర్చులు ట్రైన్ టికెట్ కంటే ఎక్కువగా పడుతున్నాయని అంటున్నారు.
పార్కింగ్ ఫీజులపై ప్రశ్నించినప్పుడు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
పార్కింగ్ పేరిట అధికంగా వసూలు చేస్తున్నారని, ఇది ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నదని అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్కింగ్ ఛార్జీలను నియంత్రించాలని, స్పష్టమైన రేట్లు అమలు చేయాలని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
