మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు
జమ్మికుంట: నేటిధాత్రి
పారిశుద్ధ కార్మికులు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించాలని మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో వావిలాల పిహెచ్సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతినిత్యం కార్మికులు వివిధ రకాలైన డ్రైనేజీ పనులు చేస్తూ ఉంటారని, కార్మికులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహిస్తూ పనులు చేయాలని, పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ కార్మికుల పైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. అలాంటి కార్మికులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా జాగ్రత్తగా జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. అనంతరం హుజరాబాద్ లో పనిచేస్తున్న డి.ఎస్.ఆర్.సి కౌన్సిలర్ బత్తుల బబిత మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పైన ప్రతి ఒక్కరు అవగాహనను కలిగి ఉండాలని, ఎయిడ్స్ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చెడు వేసినాలకు దూరంగా ఉండాలని ఆమె తెలిపారు. అనంతరం హెచ్ఐవి ఎయిడ్స్ కు సంబంధించిన కరపత్రాన్ని పంపిణీ చేశారు. హెచ్ఐవి ఎయిడ్స్ పైన సందేహాలు ఉన్నట్లయితే 1097 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి కనుక్కోవాలని తెలిపారు .ఈ సందర్భంగా వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. హుజూరాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు వైద్య శిబిరాన్ని పరిశీలించి కార్మికులకు సూచనలు ఇచ్చారు . ఈ వైద్య శిబిరంలో వైద్యులు ఫరహానుద్దిన్ ,చందన, మేనేజర్ రాజిరెడ్డి, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రసాద్ గౌడ్, జమ్మికుంట హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, దిడ్డి నరేందర్, సూపర్వైజర్లు రత్నకుమారి, అరుణ, ఏఎన్ఎంలు మంజుల, వనజ రాధా, మహేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ వహించాలి
