జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో గ్రామ గౌడ కులస్తుల ఆధ్వర్యంలో గీత పారిశ్రామిక సహకార సంఘం కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఓల్లాల రాజ భాస్కర్ ,ఉపాధ్యక్షులుగా నాగపూరి కిరణ్, డైరెక్టర్లుగా ల్యాదల్ల కృష్ణమూర్తి, నేరెళ్ల కృష్ణమూర్తి, ఉమ్మ గాని సారంగం, మాచర్ల సదానందం, బోనగాని శ్రీనివాస్, నాగపూర్ తిరుపతి, పంజాల మల్లేష్, లను ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గీత కార్మికుల అభివృద్ధి కోసం పాటుపడతానని అధ్యక్షులు ఓల్లాల రాజభాస్కర్ తెలిపారు.