పద్మశాలి సంఘం సభ్యుడు రాపల్లి శ్రీధర్…
-కుల బహిష్కరణ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న పద్మశాలి సంఘం అధ్యక్షుడు..
వేములవాడ నేటిధాత్రి
కుల సంఘ బహిష్కరణ పేరుతో బెదిరిస్తూ తన సభ్యత్వాన్ని తొలగిస్తామంటూ మానసికంగా కృంగిపోయేలా చేస్తున్న పద్మశాలి సంఘ అధ్యక్షులు అవధూత రజినీకాంత్ ప్రధాన కార్యదర్శి అంబాటి గంటాద్రి కోశాధికారి కోడం గణేష్ మరియు అతనికి సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పద్మశాలి సంఘం సభ్యుడు రాపల్లి శ్రీధర్ అన్నారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కుల సంఘం నుండి బహిష్కరిస్తామంటూ బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి పద్మశాలి సంఘ సభ్యుడిగా ఉంటూ సంఘంలో అనేక పదవులు పొంది సంఘ అభివృద్ధికి కృషి చేస్తుంటే తన పై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ లెటర్ ప్యాడ్లపై కుల బహిష్కరణ పేరుతో తనను సభ్యత్వం నుండి తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ప్రస్తుతం సంఘం అధ్యక్షుడిగా ఉన్న అవధూత రజనీకాంత్ పదవి కాలం 05/09/ 2024 తో ముగిసినప్పటికీ నాపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ నన్ను మరియు నా కుటుంబ సభ్యులను మానసికంగా వేదనలకు గురి చేయిస్తున్నారని అన్నారు గతంలో నేను అతనిపై సంఘం అధ్యక్షుడిగా పోటీ చేసిన సమయంలో నన్ను బెదిరింపులకు గురి చేసి పోటీ నుండి తప్పించారని మళ్లీ సంఘం ఎన్నికలు వస్తున్న తరుణంలో నాపై ఇలా తప్పుడు ఆరోపణలతో సంఘం సభ్యత్వాన్ని తొలగిస్తూ కుల బహిష్కరణ చేస్తున్నారని అన్నారు నాపై తప్పుడు ఆరోపణలు చేసి కుల బహిష్కరణ చేసే పలువురు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు