గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది…

*గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది…

*ఎమ్మెల్యే పులివర్తి నాని..

*ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది…

*హరిజనవాడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే…

*ఎమ్మెల్యే గ్రామంలోని మాతమ్మ దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

*కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం అని తెలిపిన ఎమ్మెల్యే..

*బుచ్చినాయుడుపల్లి పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని కి ఘన స్వాగతం పలికిన

*అధికారులు,కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు.

*ప్రతీ నెల 1వ తేదీ క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేస్తున్న కూటమి ప్రభుత్వం…

*లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛను పంపిణీ చేసి..

*కాలనీ లోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న
ఎమ్మెల్యే…

*చంద్రగిరి మండలంలో 8292 మందికి పెన్షన్లు మంజూరైనట్లు దానికోసం 3 కోట్ల 41 లక్షల 86వేల రూపాయలు మంజూరైందని…

బుచ్చినాయుడుపల్లి పంచాయతీలో 385 మందికి 15 లక్షల 98 వెలరూపాయలు మంజూరైనట్లు తెలిపిన ఎమ్మెల్యే

చంద్రగిరి(నేటి ధాత్రి)

 

గత వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని… కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు ఏర్పరుచుకుని ఆర్థిక రాబడిని రాబట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మన అధినాయకులు గాడిలో పెడుతున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి డిసెంబర్ 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ ను అవ్వ,తాత, వికలాంగులకు ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా చంద్రగిరి మండలం పరిధిలోని బుచ్చినాయుడుపల్లి పంచాయతీ హరిజనవాడలో అధికారులు, స్థానిక కూటమి పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పింఛను పంపిణీ చేసి. కాలనీలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.చంద్రగిరి మండలంలో డిసెంబర్ నెలలో 15 నూతన పింఛన్లు మంజూరు చేసిందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో 100% పింఛను పంపిణీ పూర్తి చేయడానికి అధికారులు సహకరించాలని కోరారు. ప్రజల కష్టాలు, సమస్యలు తెలిసినవారు కాబట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ప్రతి నెల క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగుతుంద‌ ని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు‌ కృషి చేస్తానని ఆయన తెలిపారు.
కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం అని తెలిపిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version