మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్థిక చేయూత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి…

మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్థిక చేయూత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

నర్సంపేట, నేటిధాత్రి:

 

మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్థిక చేయూతగా తోడ్పడుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) నర్సంపేట డిపోలో మంగళవారం మహాలక్ష్మి సంబురాలు ఘనంగా నిర్వహించారు. డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రెగ్యులర్‌గా బస్సుల్లో ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులను శాలువాలు, బహుమతులతో సన్మానించారు. మహాలక్ష్మి పథకం ద్వారా నర్సంపేట డిపో పరిధిలో 2 కోట్లు 49 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి సుమారు రూ.106 కోట్లు ఆదా చేసుకున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గణేష్, ఆర్డీవో ఉమారాణి, మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మహిళా సమాఖ్య సభ్యులు, డిపో అధికారులు, డిపో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version