ఆనాటి బావులే, బాగుండే…..

ఆనాటి బావులే, బాగుండే…..

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, కొల్లూరు గ్రామానికి, గత ప్రభూత్వం, మిషన్ భగీరథ పథకం ద్వారా, మంచినీటిని, ఈ గ్రామానికి సరఫరా చేయలేక పోవడంతో, ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభూత్వ హయాంలో త్రవ్వించిన, వాటర్ షెడ్ బావిలోని నీటినే, నీళ్ల ట్యాంకులలో నిల్వ చేసి, ఇంటింటికి నల్లాల ద్వారా, ఈ నాటికి సరఫరా చేస్తున్నారు. వేసవికాలం రావడంతో, వాటర్ షెడ్
బావిలోని నీళ్ళు తగ్గిపోయాయి.రెండవది, గ్రామ ప్రజలందరికీ, మరియు పశువులకు, త్రాగునీటి అవసరాలు తీర్చేది, బోరు బావి, ఈ నీటిని పట్టుకొని పోవుటకు వీలుగా, హనుమాన్ మందిర్ ముందు,నీటి తొట్టిని ఏర్పాటు చేశారు. ఇక్కడినుండే గ్రామ ప్రజలందరూ త్రాగునీటిని, తీసుకొని వెళ్ళతారు. ఈ బోరు భావి మోటర్ చెడిపోయినా, కరెంటు లేకపోయినా, ప్రజలకు నీటి ఇబ్బందులు తప్పవు. గ్రామ ప్రజల నీటి కొరతను కొంత వరకు తీర్చాలంటే, దళ్ళిత వాడలో , ఏ నాడో త్రవ్వి, రాతితో నిర్మించిన, రెండు బావులు ఇక్కడ ఉన్నాయి. ఈ బావులలోని నీటితోనే, ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు, ఇతర అవసరాలకు, ఈ నీటినే వాడుకున్నారు. ఎండలుముదరడంతో, ఈ బావులలోని నీళ్లు, అడుగంటాయి. కావున ప్రభూత్వ అధికారుల స్పందించి, ఈ బావులలోని పూడికను తీయించి, మరమ్మతులు చేయించినట్లయితే, గ్రామ ప్రజలకు , మరియు పశువులకు, నీటి అవసరాలు కొంతవరకు తిరుతాయని, గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు. కావున అధికారులు స్పందించి, ఈ రెండు బావులలోని, పూడికను తీయించాలని ప్రజలు కోరుచున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version