మాదన్నపేట పాఠశాలకు రూ. లక్ష విలువగల ఫర్నిచర్ అందజేత…..

మాదన్నపేట పాఠశాలకు రూ. లక్ష విలువగల ఫర్నిచర్ అందజేత…..

ప్రభాకర్ రావు ను అభినందించిన పాఠశాల అధ్యాపక బృందం…

నేటిధాత్రి కమలాపూర్

 

(హనుమకొండ)మండలంలోని మాదన్నపేట ఉన్నత పాఠశాలకు అదే గ్రామానికి చెందిన గంగు ప్రభాకర్ రావు రూ.ఒక లక్ష విలువగల ఫర్నిచర్ ను అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొల్లూరు వెంకన్న తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సౌలభ్యం కోసం బెంచీలు టేబులు,ఇనుప ఆల్మరాల తో పాటు కుర్చీలను అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవసరాల మేరకు ఫర్నిచర్ అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ప్రభాకర్ రావును ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సౌలభ్యం కోసం గ్రామానికి చెందిన దాతలు, పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రధానోపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కొల్లూరు వెంకన్న తోపాటు ఉపాధ్యయబృందం శ్రీనివాస్,శ్రీరాములు,ప్రమీల, కుమారస్వామి,రమాదేవి, అరుణ,జ్యోతి,సృజన తదితరులు పాల్గొన్నారు.

చానిగెపల్లిలో ₹20 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

చానిగెపల్లిలో ₹20 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ని న్యాల్కల్ మండలం, చనిగెపల్లి గ్రామంలో సుమారు ₹20 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ సుధాకర్ నాయకత్వంలో ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో రోడ్లు, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పనులు కొనసాగుతాయని సర్పంచ్ తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత గ్రామంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు సౌకర్యం కలుగుతుందని, ఇది గ్రామాభివృద్ధికి కీలక ముందడుగు అని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఎంపీపీ సురేష్ కుమార్ షెట్కార్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version