గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పద్మశాలి ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పద్మశాలి ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

వరంగల్, నేటిధాత్రి.

 

 

 

పద్మశాలి జర్నలిస్టు అసోసియేషన్, పద్మశాలి డాక్టర్స్, పద్మశాలి రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో హంటర్ రోడ్డులోని వేద బ్యాంకెట్ హాల్‌లో “విక్టరీస్ ఫెలిసిటేషన్” పేరుతో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పద్మశాలి ప్రజాప్రతినిధులకు ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన పద్మశాలి ప్రతినిధులను మేయర్ దంపతులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ప్రజల విశ్వాసాన్ని పొందుతూ ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మేయర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములు, మాజీ జడ్పీ చైర్మెన్ సాంబారి సమ్మారావు, పద్మశాలి జర్నలిస్టు అసోసియేషన్ మరియు వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, కార్పొరేటర్ నరేందర్ కుమార్, సీనియర్ జర్నలిస్టులు గడ్డం కేశవ మూర్తి, మెండు రవీందర్, రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version