కేంద్ర బడ్జెట్ 2026.. మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిన కేంద్రం…

కేంద్ర బడ్జెట్ 2026.. మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిన కేంద్రం

 

కేంద్రం.. బడ్జెట్ 2026-27లో ఆల్కహాల్ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(టీసీఎస్)ను 2 శాతంగా నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. బడ్జెట్ 2026-27లో ఆల్కహాల్ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ యాట్ సోర్స్(టీసీఎస్)ను 2 శాతంగా నిర్ణయించింది. గతంలో ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్‌పై టీసీఎస్ వివిధ రకాలుగా ఉండేది. కొన్ని సార్లు చాలా ఎక్కువగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ రంగాలలోని సెల్లర్స్‌కు మేలు జరగనుంది. ట్యాక్స్ సిస్టమ్ సులభతరం కానుంది.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

సెల్లర్లకు పెను భారం తగ్గనుంది. ఈ ప్రకటనతో గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్టింగ్ సిస్టమ్ బిజినెస్ ఫ్రెండ్లీగా మారే అవకాశం ఉంది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆల్కహాల్ సెల్లర్లకు మంచి జరిగినా.. మద్యం తాగే వారికి మాత్రం నష్టం తప్పేలా లేదు. ఇకపై మద్యం రేట్లు పెరిగే అవకాశం ఉంది. కేవలం ఆల్కహాల్ రేట్లు మాత్రమే కాదు.. సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై భారీగా ప్రభావం పడనుంది. వాటి రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వం విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్‌ను తగ్గించింది. చదువులు, వైద్యంపై టీసీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది.

నిర్మలమ్మ బడ్జెట్‌.. క్రీడా వస్తువుల తయారీకి ప్రత్యేక పథకం…

నిర్మలమ్మ బడ్జెట్‌.. క్రీడా వస్తువుల తయారీకి ప్రత్యేక పథకం

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో భాగంగా క్రీడారంగానికి సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. క్రీడా సరఫరా వస్తువులను అధిక నాణ్యతతో.. సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా క్రీడారంగానికి సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. క్రీడా సరఫరా వస్తువులను అధిక నాణ్యతతో.. సరసమైన ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
‘భారతదేశం క్రీడా సరఫరా వస్తువుల రంగంలో ప్రపంచ శక్తిగా ఎదగాలనేది మా సంకల్పం. ఆ దిశగానే ముందుకు సాగనున్నాం. క్రీడా సరఫరా వస్తువుల తయారీకి ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెడతాం. గత పదేళ్లుగా భారత ప్రభుత్వం క్రీడల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందుకోసం ఓ సరికొత్త మోడల్‌ను అవలంబించింది. కేవలం స్టేడియాలు నిర్మించడమే కాకుండా.. ఆర్థిక పరంగానూ అభివృద్ధి దిశగా సాగుతోంది’ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

‘పిరమిడ్ మోడల్’ ఏర్పాటు..

అట్టడుగు స్థాయి నుంచి క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకే ‘పిరమిడ్ మోడల్’ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. క్రీడల మౌలిక వసతులను శిక్షణను పటిష్టం చేయడమే కాకుండా ఎలైట్ క్రీడాకారులకు కూడా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే దీని లక్ష్యం. ప్రభుత్వం ఇప్పటికే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రపంచ వేదికల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి నిధులను కేటాయించి క్రీడాకారుల ప్రదర్శనను మెరుగుపర్చడంలో భాగస్వామ్యం అవుతోంది.

క్రీడా సరఫరా వస్తువులపై ప్రభావం..

ఈ బడ్జెట్ ప్రకటన దేశంలోని క్రీడా సరఫరా రంగాన్ని మరింత బలపరిచే అవకాశం కల్పిస్తుంది. క్రీడా సరఫరా వస్తువులను అద్భుతమైన నాణ్యతతో, సరసమైన ధరలో అందుబాటులో ఉంచడం వల్ల క్రీడాకారులకే కాకుండా అభిమానులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. దీని ద్వారా భారత దేశం ప్రపంచ స్థాయి క్రీడా సరఫరా వస్తు తయారీ కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో భాగంగా 200 వారసత్వ పరిశ్రమలు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఈ నిర్ణయం లోకల్ పరిశ్రమలను బలోపేతం చేస్తూ భారతదేశంలో క్రీడా సరఫరా వస్తువుల తయారీలో అత్యధిక స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించనుంది.

చరిత్ర సృష్టించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

చరిత్ర సృష్టించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఎవరికీ సాధ్యంకాని రికార్డు..

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ అరుదైన రికార్డును సృష్టించబోతున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ ఈ బడ్జెట్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అస్థిర భౌగోళిక, రాజకీయ పరిస్థితుల మధ్య ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో సంస్కరణ చర్యలు బడ్జెట్‌లో ఉంటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో నిర్మలా సీతారామన్ ఓ అరుదైన రికార్డును సృష్టించబోతున్నారు. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు.

భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను బ్రిటీష్ పాలనలో ప్రవేశపెట్టారు. దీనిని ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ 7న చదివారు. స్వాతంత్ర్యం తర్వాత, భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు. వేరు వేరు సమయాల్లో 10 బడ్జెట్‌లను దేశాయ్ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. 1959-1964లో ఆర్థిక మంత్రిగా దేశాయ్ మొత్తం 6 బడ్జెట్‌లను, 1967-1969 మధ్య 4 బడ్జెట్‌లను పార్లమెంట్ లో చదివారు.ఆ తర్వాత మాజీ ఆర్థిక మంత్రులు పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వేర్వేరు ప్రధానుల హయాంలో వరుసగా తొమ్మిది, ఎనిమిది సార్లు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. అయితే నిర్మలా సీతారామన్ మాత్రం ఒకే ప్రధాని హయాంలో వరుసగా తొమ్మిది బడ్జెట్‌లను ప్రవేశపెట్టి, వరుసగా అత్యధిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డును క్రియేట్ చేయనున్నారు. 2019లో ప్రధానమంత్రి మోదీ రెండవసారి గెలిచినప్పుడు, ఆమె భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. 2024లో మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమెను ఆర్థిక మంత్రిగా కొనసాగించారు. ఇప్పటివరకు, ఆమె ఫిబ్రవరి 2024లో తాత్కాలిక బడ్జెట్‌తో సహా మొత్తం ఎనిమిది వరుస బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version