రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ తనిఖీ
రామాయంపేట సెప్టెంబర్ 10 నేటి ధాత్రి (మెదక్)
మెదక్ జిల్లా రామాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆర్డీఓ గారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో యూరియా పంపిణీ పరిస్థితులు, 22-ఎ సమాచారం, భూభారతి పనులు, రెవెన్యూ సభల్లో ఫైళ్ల పరిష్కారం, మీ సేవ డాష్బోర్డ్ వంటి అంశాలపై సమీక్ష చేపట్టారు. అదేవిధంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను పరిశీలించారు.
తదుపరి సిబ్బందితో మాట్లాడిన ఆర్డీఓ గారు సమయపాలన కచ్చితంగా పాటించాలని, దరఖాస్తులు, అభ్యంతరాలపై ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, లైసెన్స్ సర్వేయర్లతో సమావేశమై రెవెన్యూ సంబంధిత పనులపై మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు మహమ్మద్ గౌస్. గోపి. సిబ్బంది సుష్మ. సౌమ్య. రోజా. సునీత. తదితరులు పాల్గొన్నారు