వడదెబ్బకు మహిళా కూలీ అస్వస్థత…

వడదెబ్బకు మహిళా కూలీ అస్వస్థత

పరకాల,నేటిధాత్రి

పరకాల వ్యవసాయ మార్కెట్‌లో శనివారం ఎండ తీవ్రత కారణంగా మహిళా కూలీ ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే పొరండ్ల గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ పరకాల ఐకేపీ సెంటర్‌లో వడ్ల బస్తాలు నింపే పనిలో నిమగ్నమై ఉండగా తీవ్ర ఎండ ప్రభావంతో అకస్మాత్తుగా కుప్పకూలింది.ఇది గమనించిన తోటి కూలీలు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఈఎంటీ మహేందర్, పైలట్ ప్రకాష్ ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలికి ప్రథమ చికిత్స అందించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.సమయానికి స్పందించి మహిళకు చికిత్స అందించిన 108 సిబ్బందిని తోటి కూలీలు అభినందించారు.తీవ్ర ఎండల నేపథ్యంలో కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.

గుడిబండ గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన. సర్పంచ్.

గుడిబండ గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన. సర్పంచ్.

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేలా.. చలివేంద్రం ఏర్పాటు.

బాటసారులకు సేద తీరే అవకాశం సర్పంచ్ మందుల నాగయ్య.

కోదాడ, నేటి ధాత్రి:

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు శుక్రవారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో సర్పంచ్ మందుల నాగయ్య చొరవ చూపి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత వల్ల ప్రజలు పనుల నిమిత్తం బయటకు వచ్చినప్పుడు దాహంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో (డి ఎల్ పిఓ) డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీ ఓ, గ్రామ ఉప సర్పంచ్ ఇర్ల జయసింహా రెడ్డి, సెక్రటరీ, వార్డు మెంబర్లు సిబ్బంది తదితరులు పెద్దలు పాల్గొన్నారు.

వేసవికాలం దృష్ట్యా చలివేంద్రాల ఏర్పాటు…

వేసవికాలం దృష్ట్యా చలివేంద్రాల ఏర్పాటు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

వేసవికాలం దృష్ట్యా క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం,రాజీవ్ చౌక్, సూపర్ బజార్, ఏ జోన్ రామాలయం, రైల్వే స్టేషన్, అమ్మగార్డెన్ ఏరియాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీటినీ అందించే చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మునిసిపాలిటీ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి, వైస్ ఛైర్పర్సన్ మిట్టపల్లి సరిత, మునిసిపాలిటీ కమిషనర్ మారుతి ప్రసాద్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విపరీతమైన ఎండలు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు, బాటసారులు, ప్రయాణికులు వారి దాహార్తిని తీర్చుకునేందుకు మున్సిపల్ పాలకవర్గము ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చలివేంద్రాలను ప్రజలంతా వినియోగించుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జ్ మేనేజర్ సతీష్, ఏఈ ఆశ్రిత్, సంబంధిత వార్డు అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పత్తిపాకలో వడదెబ్బతో వ్యక్తి మృతి

పత్తిపాకలో వడదెబ్బతో వ్యక్తి మృతి

కేంద్ర,రాష్ట్ర జౌళి శాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించాలి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో వడ దెబ్బతో వ్యక్తి మృతి చెందా డు. వివరాలకు వెళ్తే చేనేత కార్మికుడు కందగట్ల సదాశి వుడు 60 సంవత్సరాల చేనేత కార్మికుడు తన కార్య క్రమాలు ముగించుకొని ఇంటి కి వెళ్లిభోజనం చేసినతర్వాత అకస్మాత్తుగా వెంటనే చనిపో వడం జరిగింది కావున పేద చేనేత కార్మికుడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జౌళి శాఖ రాష్ట్ర జౌళి శాఖ చేనేత శాఖలు మండల ఎమ్మార్వో ఎంపీడీవో గ్రామ విఆర్ఓ సర్పంచ్ చనిపోయిన కుటుం బానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇప్పించి కుటుం బాన్ని ఆదుకోవాలని తోటి చేనేత కార్మిక సోదరులందరూ కూడా మండల గ్రామ ప్రజ లందరూ కోరుతున్నారు అతనిపై మానవత్వాన్ని ఆలోచించి తక్షణమే50 లక్షలు ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరుతూ పేదవాని జీవితం అతని ఆత్మకు శాంతి కలగా లని మేమందరం చేనేత కార్మికులు కోరడమైనది.

వేసవి వేడి మధ్య కూలీలకు రక్షణ… ఉపాధి హామీలో కలెక్టర్ కట్టుదిత్తమైన చర్యలు

వేసవి వేడి మధ్య కూలీలకు రక్షణ… ఉపాధి హామీలో కలెక్టర్ కట్టుదిత్తమైన చర్యలు

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులలో ఉపాధి హామీ కూలీల సంక్షేమం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని భీమిని మండల కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాలను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంగామోహన్ లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉష్ణోగ్రత తీవ్రమవుతున్న దృష్ట్యా ఉదయం 6 గంటలకు పని ప్రదేశానికి చేరుకొని 11 గంటల లోగా ఇళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని,పని ప్రదేశాలలో నీడ,త్రాగునీరు,ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు,మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో రహదారులు, నిబంధనల ప్రకారం వ్యక్తిగత సంబంధిత పనులు మంజూరు చేస్తామని,కూలీలు 100 రోజుల పని పూర్తి చేసుకోవాలని తెలిపారు.గ్రామ సభల ద్వారా గుర్తించిన పనుల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 90 రోజుల పని దినాలను ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించడం జరుగుతుందని తెలిపారు.అవసరం అయిన వారికి ఇంకుడు గుంతలు, పశువుల షెడ్లు,ఫారం పాండ్లు, చాపల చెరువులు వంటి పనులను మంజూరు చేస్తామని తెలిపారు.పనుల నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తున్న భీమిని, బిట్టూరుపల్లి,చిన్న గుడిపేట క్షేత్ర సహాయకులు లీలావతి, సాయిరాం,సత్యనారాయణ లను శాలువాలతో సత్కరించి నగదు బహుమతి అందజేశారు.

భూభారతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు,రిజిస్టర్లు,పరిసరాలను పరిశీలించారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,గర్భిణులు ఆసుపత్రులలోనే ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.సాధారణ ప్రసవాలు,సిజేరియన్ల వివరాలు తెలుసుకొని వైద్యులకు పలు సూచనలు చేశారు.ఆసుపత్రిలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు,మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసిల్దార్ బి.కర్ణదాస్ తో కలిసి హాజరు పట్టిక,భూభారతి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.ఉద్యోగులు, అధికారులు,సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరిచూసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు

భీమిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభకు అధికారులతో కలిసి హాజరయ్యారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయితీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని,పరిపాలన సౌలభ్యం కొరకు గ్రామ సర్పంచ్, ఎంపిటిసి,ఎంపిపి,జిల్లా పరిషత్ వ్యవస్థల ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని,క్షేత్రస్థాయిలో స్థానికత కలిగిన ప్రజా ప్రతినిధులకు సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని,తద్వారా సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని,అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అద్దుతాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు వంటి ప్రభుత్వం పథకాలు విజయవంతం కావడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు.గ్రామ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభకు అధికారులు,ప్రజా ప్రతినిధులు బాధ్యతలు హాజరుకావాలని,గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.

వైద్య సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలి

అనంతరం కన్నేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు,మందుల నిల్వలు,పరిసరాలను పరిశీలించారు.వేసవి అయినందున వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని,వైద్యులు,సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంల సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెలలో భగభగలే..

ఈ నెలలో భగభగలే!

రాష్ట్రంలో ఈ వేసవి సీజన్‌ మొత్తం ఎండ మంట పుట్టించనుంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఈ మూడు నెలల్లో ఎక్కువ రోజులు వడగాడ్పులు వీయనున్నాయి.

కాంగ్రెస్‌తో స్నేహంగా ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు: కూనం

 

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

సమాధానం చెప్పేందుకు అసెంబ్లీకి రావాలా?

పోలవరానికి 1301 కోట్లు

ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5లక్షల సాయం

ఉమ్మీద్‌ పోర్టల్‌లో నూతన మాడ్యూల్స్‌

పొంగులేటిపై తప్పుడు ఆరోపణలా?

డిమాండ్‌ లేని సమయంలో యూనిట్‌కు 50 పైసలు రాయితీ!

నేతన్నకు ‘పవర్‌’ గిఫ్ట్‌

నేటి నుంచి నల్లమల సలేశ్వరంలో జాతర

ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాల చిత్రీకరణ

బాలుడిపై లైంగిక దాడి, వేధింపులు

ఉరేసుకున్న భర్త..17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య

కాంగ్రెస్‌తో స్నేహంగా ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు: కూనం

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

సమాధానం చెప్పేందుకు అసెంబ్లీకి రావాలా?

పోలవరానికి 1301 కోట్లు

ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5లక్షల సాయం

ఉమ్మీద్‌ పోర్టల్‌లో నూతన మాడ్యూల్స్‌

పొంగులేటిపై తప్పుడు ఆరోపణలా?

డిమాండ్‌ లేని సమయంలో యూనిట్‌కు 50 పైసలు రాయితీ!

నేతన్నకు ‘పవర్‌’ గిఫ్ట్‌

నేటి నుంచి నల్లమల సలేశ్వరంలో జాతర

ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాల చిత్రీకరణ

బాలుడిపై లైంగిక దాడి, వేధింపులు

ఉరేసుకున్న భర్త..17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య

  • వడగాడ్పులూ ఎక్కువే.. వర్షాలు కూడా..
  • నైరుతి సీజన్‌ ప్రారంభం నుంచే ఎల్‌నినో
  • రానున్న 3 నెలలకు ఐఎండీ బులెటిన్‌ విడుదల

 రాష్ట్రంలో ఈ వేసవి సీజన్‌ మొత్తం ఎండ మంట పుట్టించనుంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఈ మూడు నెలల్లో ఎక్కువ రోజులు వడగాడ్పులు వీయనున్నాయి. ఏప్రిల్‌లో సగటున మూడు, నాలుగు రోజులు, మే, జూన్‌ నెలల్లో పది, అంతకంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తాయి. రాత్రి వాతావరణం కూడా వేడిగానే ఉండనుంది. రానున్న మూడు నెలలకు దేశంలో వాతావరణ పరిస్థితులు, ఎండలు, వడగాడ్పులు, వర్షాలపై మంగళవారం భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బులెటిన్‌ విడుదల చేసింది. వచ్చే మూడు నెలలు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారే అవకాశం ఉంది. ఏపీతోపాటు ఒడిశా, తెలంగాణలో కొంత భాగం, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, యూపీ, ఈశాన్య రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకానున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయి.

దేశంలోని 95 శాతం ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తాయి. ఏప్రిల్‌లో రాష్ట్రంలోని గోదావరి జిల్లాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఇక ఏప్రిల్‌లో ఈశాన్య రాష్ట్రాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానుంది. మార్చిలో సాధారణ వర్షపాతం 29.9 మిల్లీమీటర్లకుగాను 33.7 మిల్లీమీటర్లు నమోదైంది. 1901 నుంచి ఇప్పటి వరకు మార్చిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోద వడం ఇది 32వ సారి.

చివరిదశకు లానినా..

పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా చివరిదశకు చేరుకుంది. కొద్దిరోజుల్లో తటస్థ పరిస్థితులకు చేరుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ మోడల్స్‌ వెల్లడిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు తటస్థ పరిస్థితులు కొనసాగుతాయని, జూన్‌(నైరుతి రుతుపవనాల ప్రారంభం) నుంచే ఎల్‌నినో మొదలవుతుందని ఐఎండీ అంచనా వేసింది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఎల్‌నినో బలపడడానికి 62 శాతం అవకాశాలు ఉన్నాయని, ఈ ఏడాది చివరి వరకు ఎల్‌నినో కొనసాగుతుందని పేర్కొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version