మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి…

మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు- కలెక్టర్లు,ఈ. ఆర్. ఓ. లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు ముందు గా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని,ఇందుకుగాను గ్రామ పాలన అధికారులు,ఇతర అధికారులను బూత్ స్థాయి అధికారులకు మ్యాపింగ్ లో సహాయకులుగా నియమించి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని,బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు,ఏ ఈ ఆర్ ఓ లు వారికి మ్యాపింగ్ చేయడంలో సహాయ సహకారాలు అందించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జరిగేలా పకడ్బందీగా ప్రక్రియ చేయాలని తెలిపారు.40 సంవత్సరాల లోపల ఉన్న మహిళల మ్యాపింగ్ ను వారి తల్లిదండ్రుల వివరాల ఆధారంగా చేయాలని,బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని తెలిపారు.పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని,బ్లర్డ్ ఫొటోస్,డబుల్ ఎంట్రీలపై దృష్టి సాధించాలని తెలిపారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లాలోని బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందని,బూత్ స్థాయి అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ,ఎన్నికల అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: సుదర్శన్ రెడ్డి

నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎన్.మౌర్య..

*ఈ నెల 26 లోపు 2002 సంవత్సరపు ఎన్నికల జాబితా అనుసంధానం పూర్తి చేయండి..

*నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎన్.మౌర్య..

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర23

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు 2002 సంవత్సరపు ఓటర్ జాబితాతో 2025 జాబితాను ఈ నెల 26 లోపు అనుసంధానం చేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య బి.ఎల్. ఓ లను ఆదేశించారు. 2002 సంవత్సరపు ఓటర్ జాబితా తో 2025 జాబితా అనుసంధానం చేసే విధానంపై స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు మంగళవారం బి.ఎల్. ఓ.లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారుఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులు అందరూ 2002 ఓటర్ల జాబితాతో 2025 జాబితాను అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మీ అందరికీ 2025 జాబితాలో 35 సంవత్సరాలు నిండిన వారి జాబితాను ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఈ రెండు సరిపోల్చుకుంటూ ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది గుర్తించాలని తెలిపారు.
ఈ ప్రక్రియను సెప్టెంబర్ 26 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పి4 సర్వే పై సచివాలయ కార్యదర్శులకు డిజిటల్ శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ రవి, తహసీల్దార్ సురేష్ బాబు, సిబ్బంది, బి.ఎల్. ఓ లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version