ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగులకు సరైన న్యాయం చేయ లేదు….

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగులకు సరైన న్యాయం చేయ లేదు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన జిల్లా దివ్యాంగ.సమితి నాయకులు దొంతనేని.చందర్రావు . మాట్లాడుతూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా చందర్రావు మాట్లాడుతూ. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ.పెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రంలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం చేసి. నిరాశ మిగిలించిందని తెలియజేస్తూ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని. దివ్యాంగుల కోసం 6,000 పింఛను మంజూరు చేయాలని తెలియజేస్తూ. గతంలో ఇచ్చిన హామీలను నెరవేస్తారని రాష్ట్రంలో దివ్యాంగులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారని. కానీ ప్రభుత్వం దివ్యాంగులకు ఎటువంటి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని. బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమాన్ని కనీసం పరిగణంలోకి తీసుకోకుండా బడ్జెట్ కేటాయించడం చాలా దురదృష్టకరమని. గత ప్రభుత్వం దివ్యాంగులకు 4000 రూపాయలు .పింఛన్ ఇచ్చిన మాట నిలుపుకున్న ఆనాటి ప్రభుత్వం. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దివ్యాంగులకు 6000 .పింఛన్ ఇస్తామని .మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ రెండున్నర సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ప్రభుత్వం చెల్లించడం లేదని వెంటనే దివ్యాంగుల సంక్షేమానికి సరిపడా బడ్జెట్ కేటాయించాలని ఇచ్చిన మాట ప్రకారం 6000. రూపాయల. పెన్షన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ లేని పక్షంలో వచ్చే మాసంలో తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగుల ఆధ్వర్యంలో తీవ్రమైన నిరసనలు కార్యక్రమాలు చేపడతామని. ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే దివ్యాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగుల సమితిల ఆధ్వర్యంలో జిల్లా నాయకులు దొంతినేని చందర్రావు డిమాండ్ చేశారు

పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ శనివారం పూర్తి చేశారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, జగన్ మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, భారతి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాల రహిత జిల్లాగా నిలవాలి…

బాల్య వివాహాల రహిత జిల్లాగా నిలవాలి

బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

బాల్య వివాహాల రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన పేర్కొన్నారు. మిషన్ వాత్సల్యలో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, అమలవుతున్న పథకాలు, బాల్య వివాహాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

మిషన్ వాత్సల్యలో భాగంగా బాల్య వివాహాలు, బాల కార్మికుల కేసులు, వారి హక్కుల పరిరక్షణ తీసుకుంటున్న చర్యలు, వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన మాట్లాడారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిదేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. బాల కార్మికుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారిని సమీప విద్యాలయాల్లో చేర్పించాలని, అనాథ పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలో జాయిన్ చేయాలని సూచించారు.

విద్యాలయాలు, హాస్టల్ లో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై, 1098 హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

విద్యార్థులను విద్యా ద్వారా సామాజికంగా, ఆర్థికంగా రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందించాలని, సేవలపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.

అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని, చిల్డ్రన్ హోమ్ పనులు పూర్తి చేయిస్తామని, పిల్లల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ అంజయ్య, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డీ వీహెచ్ఓ రవీందర్ రెడ్డి, డీఈఓ వినోద్ కుమార్, డీఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, జీసీడీఓ పద్మజ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version