స్థానిక ఎన్నికల బరిలో అభ్యర్థులు: జీరో బ్యాలెన్స్ ఖాతాల కోసం బ్యాంకుల ముందు బారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడానికి బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులను ఆశ్రయిస్తున్నారు. జహీరాబాద్ కోహిర్ మొగుడంపల్లి న్యాల్కల్ ఝరాసంగం డీసీబీ, ఎస్బీఐ, కెనరా ఎస్బిఐ యూనియన్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ కార్యాలయాలు అభ్యర్థులు, వారి అనుచరులతో రద్దీగా మారాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో ఈ సందడి నెలకొంది. ఎన్నికల నియమాల ప్రకారం, అభ్యర్థులు తమ ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాలు తెరవాలి, వాటిలో జీరో బ్యాలెన్స్ ఉండాలి.
