అప్పుల బాధతో పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి
పరకాల,నేటిధాత్రి
మండలంలోని మల్లక్కపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన రాసమళ్ళ సురేష్ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక పురుగుల మందు సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.బుధవారం ఆర్థిక సమస్యలతో మానసికంగా తీవ్రంగా కలత చెందిన సురేష్ పురుగుల మందు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా,వైద్యులు చికిత్స అందించినప్పటికీ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు.సురేష్ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఇదిలా ఉండగా,తన మరణానంతరం కళ్లను దానం చేయాలని సురేష్ ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలిసింది.కుటుంబ సభ్యులు ఆయన చివరి కోరికను గౌరవిస్తూ కంటి దానం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటారు.
