గ్రంధాలయ సమస్యలపై ఎమ్మెల్యే కు వినతిపత్రం..

గ్రంధాలయ సమస్యలపై ఎమ్మెల్యే కు వినతిపత్రం

స్పందించిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన నిరుద్యోగులు,పాఠకులు

పరకాల,నేటిధాత్రి

 

 

 

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బొచ్చు రాజు స్వేరో ఆధ్వర్యంలో నిరుద్యోగులు,పాఠకులు కలిసి పాత భవనం శిథిలావస్థలో ఉన్నందున పాత మున్సిపల్ కార్యాలానికి గ్రంథాలయాన్ని మార్చాలని వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ పాత భవనం కావడంతో పెచ్చులు ఊడిపోతున్నాయని రోజు సుమారు 300 మందికిపైగా గ్రంథాలయానికి వస్తున్నారని ప్రభుత్వం నూతన భవనం కట్టించి ప్రత్యేక డెస్క్​లను ఏర్పాటు చేయాలని కోరారు.గ్రంథాలయం విద్యార్థులకు ఒక దేవాలయంలా ఉపయోగపడుతుందని ప్రస్తుత పరిస్థితులు భయానకంగా ఉన్నాయని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మరియు పురపాలక మున్సిపల్ సంఘం చైర్మన్ పావుశెట్టి సునీల్ కు వివరించారు.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి చైర్మన్ కు మరియు గ్రంథాలయ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సంబాశించి పాత మున్సిపల్ కార్యాలయంలో డిజిటల్ లైబ్రరీ,వైఫై ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు.సానుకూలంగా స్పందించినందుకు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ కు నిరుద్యోగులు,పాఠకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొడెపాక సచిన్,బొచ్చు నాగేంద్ర, బాలు,అనిల్,రాకేష్,రమేష్, అరవింద్, సురేష్,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version