పాఠశాలలో స్టేజి నిర్మాణానికి భూమి పూజ….

పాఠశాలలో స్టేజి నిర్మాణానికి భూమి పూజ….

పాఠశాల అభివృద్ధి లో ప్రభాకర్ రావు పాత్ర అభినందనీయం….

మాదన్నపేట సర్పంచ్ కత్తి రమేష్…….

నేటిధాత్రి

 

కమలాపూర్(హనుమకొండ) కమలాపూర్ మండలంలోని మాదన్నపేట గ్రామానికి చెందిన వ్యాపారవేత్త గంగు ప్రభాకర్ రావు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం బుధవారం రూ.రెండు లక్షల ఖర్చుతో స్టేజి నిర్మాణ పనికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ కత్తి రమేష్ మాట్లాడుతూ గ్రామానికి చే దిన ప్రభాకర్ రావు పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం పట్ల అభినందించారు.సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యం కోసం గత వారం క్రితం రూ.లక్ష విలువగల ఫర్నిచర్ అందించడం తో పాటు పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు గాను రూ.రెండు లక్షల ఖర్చుతో స్టేజి నిర్మాణ కార్యక్రమానికి పూనుకోవడం మాదన్నపేట గ్రామ విద్యార్థుల అదృష్టం గా భావిస్తున్నట్లు తెలిపారు.తన స్వంత డబ్బుతో పాఠశాల అభివృద్ధి కి తోడ్పాటు అందిస్తున్న ప్రభాకర్ రావుకు గ్రామ సర్పంచి తో పాటు పాలక మండలి సభ్యులు,పాఠశాల అధ్యాపక బృందం, గ్రామస్తులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ రమేష్,మాజీ సర్పంచ్ చెరుకు రాజయ్య,దాత గంగు ప్రభాకర్ రావు తో పాటు ప్రధానోపాధ్యాయులు కొల్లూరు వెంకన్న,ఉపాధ్యయబృందం,గ్రామస్తులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version