ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎమ్మెల్యే మట్టిదందా…

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎమ్మెల్యే మట్టిదందా

దందాల్లో ఎమ్మెల్యే,అధికారులు,కాంగ్రెస్ నాయకులు

పీసా చట్టం తూట్లుపొడిచి అక్రమ దందాలు..

అక్రమ మట్టి దందాపై హైకోర్టులో పిల్ దాఖలు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు కోట్లాది రూపాయల మట్టి దందా చేశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.ఈ అక్రమ దందా పట్ల బిఆర్ఎస్ లీగల్ శాఖ ఆధ్వర్యంలో హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు,పోలీస్ ,రెవిన్యూ,మున్సిపాలిటీ,ఇరిగేషన్,మైనింగ్,ఐటిడిఎ అధికారులు కలిసి చేసిన మట్టి దందా యొక్క అన్ని ఆధారాలను శాటిలైట్ ద్వారా బిఆర్ఎస్ పార్టీ సేకరించిందన్నారు.నర్సంపేట పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేస్తున్న అక్రమ దందాలపై ధ్వజమెత్తారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండదండలతోనే పోలీస్ అధికారులు, మైనింగ్ అధికారుల సహకారంతో మైనింగ్ మోరం దందా విచ్చలవిడిగా పెట్రెగిపోతున్నదని దీంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారుల పైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
నర్సంపేట మండలం రాజుపేట ఏజెన్సీ శివారు ముత్యాలమ్మ తండా గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసా చట్టాన్ని తుంగలో తొక్కి మట్టిదందాతో సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు.మున్సిపాలిటీ అధికారులు, మైనింగ్ అధికారులు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఈ దందాలో వాటాలుండడంతో
రాత్రంతా ఇతర ప్రాంతాలకు వందలాడి టిప్పర్ల మోరం తరలిస్తూ దందా సాగిస్తున్నారని ఆరోపించారు.దామెర చెరువులో లోతుగా మట్టితవ్వడం వల్ల ఊటలు వచ్చి భవిష్యత్తులో మెడికల్ కళాశాలకు ప్రమాదం ఏర్పడనున్నదని దీంతో ఎన్ఐఏ అధికారులు చెప్పినప్పటికీ పట్టించుకునే నాధుడే లేడన్నారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మాజీ ఎంపీపీ తక్కల్లపెల్లి రవీందర్ రావు,జిల్లా నాయకులు నల్లా మనోహర్ రెడ్డి,లెక్కల విద్యాసాగర్ రెడ్డి,పార్టీ పట్టణ అధ్యక్షులు నాగెళ్లి వెంకటనారాయణ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు మండల శ్రీనివాస్, దేవోజు సదనందం,గోనె యువరాజు,క్లస్టర్ బాధ్యులు, పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version