టాస్ గెలిచిన పాకిస్థాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

టాస్ గెలిచిన పాకిస్థాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

 

అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ సూపర్-6లో భాగంగా తలపడనున్నాయి. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచింది.

స్పోర్ట్స్ డెస్క్: అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో అపజయమే లేకుండా సాగిపోతున్న భారత జట్టు.. సూపర్‌-6లో భాగంగా కీలక పోరుకు సిద్ధమైంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇవాళ(ఫిబ్రవరి 1న) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా(ind vs pak) తలపడబోతోంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ నేరుగా సెమీస్‌లో అడుగు పెడుతుంది. ఇదే సమయంలో పాక్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్‌కు అవకాశముంటుంది. అయితే స్వల్ప తేడాతో ఓడితేనే అవకాశం ఉంటుంది. గ్రూప్‌-1 నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌ సెమీస్‌ చేరాయి. గ్రూప్‌-2లో ఇంగ్లాండ్‌ బెర్తు ఖాయం చేసుకుంది. చివరి బెర్తు కోసం భారత్, పాక్‌ మధ్య పోటీ నెలకొంది. చివరగా పాక్‌తో తలపడినప్పుడు భారత్‌కు పరాభవం ఎదురైంది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version