కేంద్ర బడ్జెట్ 2026.. మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిన కేంద్రం…

కేంద్ర బడ్జెట్ 2026.. మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిన కేంద్రం

 

కేంద్రం.. బడ్జెట్ 2026-27లో ఆల్కహాల్ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(టీసీఎస్)ను 2 శాతంగా నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. బడ్జెట్ 2026-27లో ఆల్కహాల్ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ యాట్ సోర్స్(టీసీఎస్)ను 2 శాతంగా నిర్ణయించింది. గతంలో ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్‌పై టీసీఎస్ వివిధ రకాలుగా ఉండేది. కొన్ని సార్లు చాలా ఎక్కువగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ రంగాలలోని సెల్లర్స్‌కు మేలు జరగనుంది. ట్యాక్స్ సిస్టమ్ సులభతరం కానుంది.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

సెల్లర్లకు పెను భారం తగ్గనుంది. ఈ ప్రకటనతో గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్టింగ్ సిస్టమ్ బిజినెస్ ఫ్రెండ్లీగా మారే అవకాశం ఉంది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆల్కహాల్ సెల్లర్లకు మంచి జరిగినా.. మద్యం తాగే వారికి మాత్రం నష్టం తప్పేలా లేదు. ఇకపై మద్యం రేట్లు పెరిగే అవకాశం ఉంది. కేవలం ఆల్కహాల్ రేట్లు మాత్రమే కాదు.. సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై భారీగా ప్రభావం పడనుంది. వాటి రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వం విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్‌ను తగ్గించింది. చదువులు, వైద్యంపై టీసీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది.

నిర్మలమ్మ బడ్జెట్‌.. క్రీడా వస్తువుల తయారీకి ప్రత్యేక పథకం…

నిర్మలమ్మ బడ్జెట్‌.. క్రీడా వస్తువుల తయారీకి ప్రత్యేక పథకం

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో భాగంగా క్రీడారంగానికి సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. క్రీడా సరఫరా వస్తువులను అధిక నాణ్యతతో.. సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా క్రీడారంగానికి సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. క్రీడా సరఫరా వస్తువులను అధిక నాణ్యతతో.. సరసమైన ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
‘భారతదేశం క్రీడా సరఫరా వస్తువుల రంగంలో ప్రపంచ శక్తిగా ఎదగాలనేది మా సంకల్పం. ఆ దిశగానే ముందుకు సాగనున్నాం. క్రీడా సరఫరా వస్తువుల తయారీకి ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెడతాం. గత పదేళ్లుగా భారత ప్రభుత్వం క్రీడల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందుకోసం ఓ సరికొత్త మోడల్‌ను అవలంబించింది. కేవలం స్టేడియాలు నిర్మించడమే కాకుండా.. ఆర్థిక పరంగానూ అభివృద్ధి దిశగా సాగుతోంది’ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

‘పిరమిడ్ మోడల్’ ఏర్పాటు..

అట్టడుగు స్థాయి నుంచి క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకే ‘పిరమిడ్ మోడల్’ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. క్రీడల మౌలిక వసతులను శిక్షణను పటిష్టం చేయడమే కాకుండా ఎలైట్ క్రీడాకారులకు కూడా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే దీని లక్ష్యం. ప్రభుత్వం ఇప్పటికే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రపంచ వేదికల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి నిధులను కేటాయించి క్రీడాకారుల ప్రదర్శనను మెరుగుపర్చడంలో భాగస్వామ్యం అవుతోంది.

క్రీడా సరఫరా వస్తువులపై ప్రభావం..

ఈ బడ్జెట్ ప్రకటన దేశంలోని క్రీడా సరఫరా రంగాన్ని మరింత బలపరిచే అవకాశం కల్పిస్తుంది. క్రీడా సరఫరా వస్తువులను అద్భుతమైన నాణ్యతతో, సరసమైన ధరలో అందుబాటులో ఉంచడం వల్ల క్రీడాకారులకే కాకుండా అభిమానులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. దీని ద్వారా భారత దేశం ప్రపంచ స్థాయి క్రీడా సరఫరా వస్తు తయారీ కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో భాగంగా 200 వారసత్వ పరిశ్రమలు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఈ నిర్ణయం లోకల్ పరిశ్రమలను బలోపేతం చేస్తూ భారతదేశంలో క్రీడా సరఫరా వస్తువుల తయారీలో అత్యధిక స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించనుంది.

రేపే కేంద్ర బడ్జెట్.. ఎప్పుడు.. ఎక్కడ వీక్షించాలి.. ఏమిటా ప్రత్యేకతలు?

రేపే కేంద్ర బడ్జెట్.. ఎప్పుడు.. ఎక్కడ వీక్షించాలి.. ఏమిటా ప్రత్యేకతలు?

 

ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో సమర్పిస్తారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఆదివారం రోజున బడ్జెట్ సమర్పణ జరుగుతుండటం గమనార్హం.

 దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ణయించే యూనియన్ బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు (ఫిబ్రవరి 1) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇది.. ఒక మహిళా ఆర్థిక మంత్రి వరుసగా ఒకే ప్రధాని నేతృత్వంలో సమర్పించనున్న తొమ్మిదవ కేంద్ర బడ్జెట్ కావడం విశేషం. ఈ బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ప్రజలు, వ్యాపార వర్గాలు, మధ్య తరగతి వేతనదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా.. ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన విషయం కావడంతో ఈ బడ్జెట్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

‘వికసిత్ భారత్ @2047’ లక్ష్యాన్ని ముందుంచుకుని ఆర్థిక సంస్కరణలు, కస్టమ్స్ డ్యూటీ మార్పులు, రుణ తగ్గింపు, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై ఈ బడ్జెట్లో మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రాయితీలు, రక్షణ, వ్యవసాయం, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో ప్రజలు, వ్యాపారవేత్తలు ఆశలు పెట్టుకున్నార

భారత రాజ్యాంగం ఆర్టికల్ 112 ప్రకారం.. ఏటా ఉభయ సభల ముందూ సమర్పించే ఈ ఆర్థిక ప్రకటనలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆదాయాలు, ఖర్చుల అంచనాలు, పన్ను ప్రతిపాదనలు, వ్యయ ప్రాధాన్యాలు, సంస్కరణలు, అభివృద్ధి చర్యలు వివరిస్తారు. కేంద్ర బడ్జెట్.. భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైంది. ప్రజలు, వ్యాపార సంఘాలు, మార్కెట్లు దీనిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కేంద్ర మంత్రి ప్రసంగం తర్వాత వివిధ రంగాల్లో ప్రతిస్పందనలు, స్టాక్ మార్కెట్ రియాక్షన్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అనంతరం బడ్జెట్ మీద విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వ్యక్తమవుతాయి.

బడ్జెట్‌ 2026: సామాన్యులకు భారీ ఊరట..

బడ్జెట్‌ 2026: సామాన్యులకు భారీ ఊరట.. ఈ వస్తువుల ధరలు తగ్గే ఛాన్స్..

 

కేంద్ర బడ్జెట్ అనగానే అందరిలో మొదటగా మెదిలే ప్రశ్న ఒకటుంటుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి? అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కేంద్రం బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలు, పన్నుల మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లల్లో సవరణలతోనే వస్తువుల ధరల్లో మార్పులు వస్తాయి.

ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28(బుధవారం) నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం(జనవరి 29న) ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సర్వే ద్వారా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. దీంతో ఫిబ్రవరి 1న రానున్న బడ్జెట్(Budget 2026) ఎలా ఉంటుందనే దానిపై సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరిలో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈసారి బడ్జెట్‌పై పలువురు ఆర్థిక నిపుణులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం క్రమంలో 2026-27 కేంద్ర బడ్జెట్‌ కీలకంగా మారింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో బడ్జెట్‌లో పలు పన్నుల మినహాయింపులు సహా ఆర్థిక సంస్కరణలూ ఉండనున్నట్టు తెలుస్తోంది.
యూనియన్ బడ్జెట్ అనగానే అందరిలో ఒక ప్రశ్న మెదులుతుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి? అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కేంద్రం బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలు, పన్నుల మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లల్లో సవరణలతోనే వస్తువుల ధరల్లో మార్పులు వస్తాయి. దీంతో 2026-27 బడ్జెట్ తర్వాత ఏయే వస్తువుల ధరలు ఎలా ఉండనున్నాయనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై అనేక అంచనాలు వెలువడుతున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులు, గృహ రుణాలు, ఈఎంఐ, ఎలక్ట్రికల్ వెహికల్స్, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసేలా పలు నిర్ణయాలు ఈ బడ్జెట్‌లో ఉండనున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version