మీసేవ కేంద్రాల దోపిడి నుండి కాపాడండి…

మీసేవ కేంద్రాల దోపిడి నుండి కాపాడండి

సింగరేణి విశ్రాంత ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లోని మీ సేవ కేంద్రాల యాజమాన్యాల దోపిడి నుండి వేలాది మంది సింగరేణి విశ్రాంత ఉద్యోగులను కాపాడాలని కలెక్టర్ కి సోమవారం విజ్ఞప్తి చేశారు.ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విశ్రాంత సింగరేణి ఉద్యోగులు పెన్షన్ దారులు జిల్లాలోని మీ సేవ కేంద్రాలలో జీవన్ ప్రమాణ్,డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ తీసుకుంటేనే సింగరేణి పెన్షన్ దారులకు ప్రతి నెల వారి వారి బ్యాంకు ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ అవుతాయని తెలిపారు.సింగరేణి విశ్రాంత ఉద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకొని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు వారికి ఇష్టం వచ్చిన విధంగా,ఇష్టరిత్య ఒక్కొక్క మీ సేవా కేంద్రాల ఎజమానులు ఒక్కో పెన్షన్ దారు నుండి 200,150,100 రూపాయిల వరకు తీసుకుంటూ చదువురాని సింగరేణి విశ్రాంత పెన్షన్ దారులను దోపిడీకి గురి చేస్తున్నారని వాపోయారు.ఒక కోల్ మైన్స్ పెన్షన్ కు 50 రూపాయిలు సిపిఎంఆర్ఎస్ ఉద్యోగి వారి జీవిత భాగస్వామికి సంబంధించిన మెడికల్ హెల్త్ కార్డు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ కు 75 రూపాయిలు తీసుకునే విధంగా జిల్లాలోని మీ సేవ కేంద్రాల యజమానులకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, జిల్లా నాయకులు ఏ.గంగయ్య ,బియ్యాల ప్రభాకర్ రావు ,జెడి బీరయ్య, సిహెచ్.వైకుంఠం,కె.రాజిరెడ్డి, డి.సాయిలు,కస్తూరి సూర్యం తదితరులు పాల్గొన్నారు .

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పోరుబాట.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పోరుబాట:

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి:

సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:

నేర్మట గ్రామపంచాయతీ, బస్టాండ్ ముందుమురికి కాలువ సరిగ్గా లేకపోవడంతో మురికి కాల్వ యందు ఈగలు, దోమలు ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారంచండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతకాలంగా గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామాలలో పలు వార్డులలో గతంలో సిసి రోడ్లు వేసినారు గాని ఆ రోడ్లు వర్షం వస్తే గుంతల మయంగా మారుతుందని, మురికి కాల్వల నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలైన పుల్లెంల, గొల్లగూడెం, బంగారిగడ్డ, లెంకలపల్లి, శేరి గూడెం, ఈ గ్రామాలకు లింకు రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అధికారులు గ్రామాలలో ఇప్పటికప్పుడు సమాచారం తీసుకోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులుఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, బల్లెం వెంకన్న,ఈరగట్ల నరసింహ, బొమ్మరగోని యాదయ్య, దాసరి రాములు, నారపాక నరసింహ, శంకర్, గ్రామ ప్రజలు బొమ్మరగోని నాగరాజు,సతీష్,బుర్కల నవీన్, బొడిగె నగేష్, బుర్కల సైదులు, రావుల రవి, పగిళ్ల స్వామి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version